Breaking News

04/02/2019

మిగులు విద్యుత్ అమ్మకానికి ట్రాన్స్ కో ప్రయత్నాలు

నెల్లూరు, ఫిబ్రవరి 4, (way2newstv.in)
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఫైబర్ కనెక్షన్ నెట్‌వర్క్ ప్రక్రియను విస్తృతం చేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ కనెక్షన్‌కు వినియోగించే ఆప్టికల్ గ్రౌండ్ వైర్ నెట్‌వర్క్‌ను బీఎస్‌ఎన్‌ఎల్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వటం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవటంతో పాటు సమాచార వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేయనుంది. ఇందులో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్, బ్రాడ్ బ్యాండ్, ఇతర నెట్‌వర్క్ సంస్థలతో ట్రాన్స్‌కో సీఎండీ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్ చర్చలు జరుపుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా 24 ఫైబర్ నెట్ కనెక్షన్ కేంద్రాలను ట్రాన్స్‌కో ఏర్పాటు చేస్తోంది. వీటిలో 12 కేంద్రాలను ప్రభుత్వరంగ, ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.


 మిగులు విద్యుత్ అమ్మకానికి ట్రాన్స్ కో ప్రయత్నాలు
 
మొత్తం 2వేల 765 కిలోమీటర్ల మేర 12 ట్రాన్స్‌కో ఫైబర్ కేబుల్ కేంద్రాల ద్వారా నెట్‌వర్క్ సంస్థలకు లీజుకు ఇస్తారు. కిలోమీటర్‌కు రూ 2250 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు బలపడటంతో పాటు ట్రాన్స్‌కోకు రెవెన్యూ పెరుగుతుందని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.వివిధ స్థాయిల్లో ఓల్టేజీ కేంద్రాల ద్వారా ప్రస్తుతం విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరి తెలిపారు. ఇప్పటికే విద్యుత్, పంపిణీ వ్యవస్థల్లో ట్రాన్స్‌కో లక్ష్యాలను అధిగమించి అనేక రికార్డులను సొంతం చేసుకుంది. తాజా ప్రతిపాదనతో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిలషిస్తున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తెలిపారు. లైన్ నష్టాలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయని చెప్పారు. ఇంధన నిర్వహణ, సామర్థ్యంలో కూడా జాతీయ స్థాయిలో ట్రాన్స్‌కో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే 4350 కిలోమీటర్ల మేర ఆప్టికల్ గ్రౌండ్ వైర్ కేబుల్ వ్యవస్థ విస్తరించింది. 400 కేవీ, 200 కేవీ, 132 కేవీ స్థాయిల్లో సబ్‌స్టేషన్లను 24 కేంద్రాలు అనుసంధానం అవుతున్నాయి. రాష్టవ్య్రాప్తంగా 22000 కిలోమీటర్ల మేర ఈహెచ్‌టీ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూగర్భ కేబుల్ వ్యవస్థను పటిష్టం చేయటంతో పాటు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకు రాగలిగితే మరిన్ని సత్ఫలితాలు సాధించ వచ్చని ట్రాన్స్‌కో భావిస్తోంది. మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు మార్కెటింగ్ చేయటంతో పాటు సరఫరాలేని సమయాల్లో నెట్‌వర్క్ సంస్థలతో అనుసంధానం కావటం ద్వారా ట్రాన్స్‌కో ఆర్థికంగా బలపడుతుందని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు ఇంధన, ఐ అండ్ ఐ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.

No comments:

Post a Comment