విజయవాడ, ఫిబ్రవరి 26, (way2newstv.in)
రాష్ట్రంలో ఒక పాలన ముగియడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ విభజనతర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఏర్పడిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, పద్నాలుగేళ్ల సీఎం అనుభవం, 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు ముగిసేందుకు మరో రెండు మాసాలు మాత్రమే సమయం ఉంది. ఇక, ఆయనకు విపక్షంగా వైఎస్ తనయుడు జగన్ పార్టీ కూడా ప్రధాన విపక్షంగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకునేందుకు మరో రెండు మాసాలు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు తొలిసారి విభజన తర్వాత ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు సీఎం అభ్యర్థుల మధ్యే హోరా హోరీ పోరు సాగనుంది. ఈ క్రమంలో.. ఈ ఇద్దరు నాయకుల్లో ఎవరు నిర్మాణాత్మకంగా వ్యవహరించారు? ఎవరికి ఎన్ని మార్కులు పడతాయి? ప‌్రజల సమస్యలను ఎవరు ఎలా పరిగణించారు? అనే విషయాలు కీలకంగా మారాయి.
ఏపీ రాజకీయ కోణంలోనే నేతల అడుగులు
ప్రజాస్వామ్య వాదులు రాజకీయాలకు అతీతంగా ఈవిషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రభుత్వం సంపాయించుకున్న చంద్రబాబు, ప్రతిపక్షం సంపాయించుకున్న జగన్‌లు తమ తమ పాత్రలను నిర్మాణాత్మకంగా పోషించారా? ప‌్రజల మనోభావాలను నిలబెట్టారా? 2014 ఎన్నికల సమయంలో ఇరు నాయకులు ఇచ్చిన హామీలను ఎంత మేరకు రీచ్ అయ్యారు. అనే ప్రశ్నలు సర్వసాధారణంగా వినిపిస్తున్నాయి.ఈ పరంపరను విశ్లేషిస్తే.. ఇద్దరు నేతలు కూడా అటు సీనియర్ మోస్ట్‌గా ఉన్న చంద్రబాబు కానీ, ఇటు యువ నాయకుడు, ప్రదాన ప్రతిపక్షం నాయకుడు జగన్‌కానీ.. ఇద్దరూ కూడా చాలా విషయాల్లో విఫలమయ్యారనే వాదన వస్తోంది. నిజానికి రాజకీయం అనేది ఎన్నికల వరకే పరిమితం కావాలని పదే పదే చెప్పిన చంద్రబాబు… తాను రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పుకొన్న జగన్.. ఇద్దరూ కూడా రాజకీయ కోణంలోనే ఈ ఐదేళ్లపాటు అడుగులు వేశారు. ఇక, సానుభూతి విషయం కూడా ఇద్దరి మధ్య తారాస్థాయిలో ప్రదక్షిణలు చేసింది. తన ప్రభుత్వానికి సానుభూతి కోసం చంద్రబాబు, తన పక్షానికి సానుభూతి, వచ్చే ఎన్నికల్లో విజయం కోసం జగన్‌లు పరితపించారు.సెంటిమెంట్ తో….ఈ విషయంలో ఈ ఇద్దరు నాయకులు కూడా వేర్వేరు పంథాలను ఎంచుకున్నారు. మానాన్న పాలన అందిస్తానని జగన్ చెప్పగా.. నేను 60 ఏళ్లవయసులోనూ మనవడిపై ప్రేమను చంపుకుని, కుటుంబానికి దూరంగా ఉండి ఇక్కడ మిమ్మల్ని పాలిస్తున్నాను. మీరు నాకిచ్చే జీతం ఓటు అంటూ.. చంద్రబాబు ఇలా ఒకరికి మించి ఒకరు సెంటిమెంట్ సింపతీకి తెరదీశారు. ప్రత్యేక హోదా. ఐదు కోట్ల మంది ఆత్మభిమానంతో ముడిపడిన విషయంలోనూ ముందు జగన్ పట్టుకుంటే.. చంద్రబాబు వదిలేయడం, బాబు పట్టుకున్నాక జగన్ వదిలేయడం.. చాలా చిత్రం. ఇక, చివరాఖరుకు వచ్చేద్దాం.. కేవలం 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారనే కోపంతో ఏకంగా అసెంబ్లీనే బాయ్ కాట్ చేశాడు జగన్. . ఈ ఎపిసోడ్ రెండున్నరేళ్లపాటు సాగింది. ఆది నుంచి అభివృద్ధి మంత్రం పఠించిన చంద్రబాబు.. చివరి నిముషంలో సంక్షేమం అంటూ డబ్బులు పందేరం చేశారు. ఇక, ఆది నుంచి సెంటిమెంట్ రగిలించిన జగన్.. ఇప్పుడు అధికార పార్టీని వీక్ చేసే పనిలో పడ్డారు. ఇలా ఈ ఇద్దరికీ మధ్య ఎక్కడా పెద్ద తేడాలు కనిపించడం లేదు. ఒక్క అధికారం అందుకునే విషయంలో తప్ప!!
No comments:
Post a Comment