Breaking News

20/02/2019

తిరుపతిలో రాజకీయ భక్తులు

తిరుపతి, ఫిబ్రవరి 20,(way2newstv.in
రాజ‌కీయ భ‌క్త‌ులు…ఓట‌రు దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి క్యూలు క‌డుతున్నారు. ఇక్క‌డి నుంచి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, జ‌న‌సేన ఇలా దాదాపు అన్ని ప్ర‌ధాన పార్టీలు పోటీకి సిద్ధ‌మ‌వుతుండ‌టం విశేషం. ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కావ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. నిత్యం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకుంటూ ఉంటారు. ఆల‌యానికి కాదు ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గానికి మంచి చ‌రిత్రే ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన త‌ర్వాత ఆయ‌న ఇక్క‌డి నుంచి తొలిసారిగా పోటీ చేసి విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో చిరంజీవి కూడా అంతే ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి ఇక్క‌డి నుంచే పోటీ చేశారు…గెలిచారు.ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి టీడీపీ త‌రుపున సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నా బీ ఫామ్ వ‌చ్చే వ‌ర‌కు ఆమెకు సీటు వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. 


తిరుపతిలో రాజకీయ భక్తులు

ఆమెతో పాటు వూకా విజ‌య్‌కుమార్‌, డాక్ట‌ర్ సుధారాణి కూడా టికెట్ కోసం త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేసుకుంటున్నారు. సుగుణ‌మ్మ భ‌ర్త వెంక‌ట‌ర‌మ‌ణ గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించారు. సుధీర్ఘ‌కాలం పాటు ఆయ‌న కాంగ్రెస్‌లో ప‌నిచేశారు. మంచి ప‌దవుల్లొ కొన‌సాగారు. 2014కు ముందు జ‌రిగిన కొన్ని ప‌రిణ‌మాల‌తో ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చేశారు. కాంగ్రెస్‌ నుంచి 2004లో ఆయ‌న ప్ర‌ముఖ సినీనిర్మాత ఎన్‌వి.ప్ర‌సాద్‌పై పోటీ చేసి గెలిచారు. 2014లో మ‌రోసారి టీడీపీ నుంచి ఘ‌న‌విజ‌యం సాధించారు. అనారోగ్యంతో ఆయ‌న 2015క‌న్నుమూశారు. ఉప ఎన్నిక‌లో సుగుణ‌మ్మ గెలుపొందారు. ఈసారి కూడా దాదాపు ఆమెనే టీడీపీ అధిష్ఠానం ఎంపిక చేసే యోచ‌న‌లో ఉన్నా మ‌రింత బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో కొన్ని పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.పార్టీల విష‌యానికి వ‌స్తే వైసీపీ నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవాస్తానం మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆయ‌న‌తో పాటు యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన గుణ‌శేఖ‌ర్ కూడా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అయితే ఇక్క‌డ భూమ‌న‌కు కాకుండా మిగ‌తా వారికి సీటు కేటాయింపు చేసేందుకు జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌ర‌ని నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు ఉన్నా గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎన్‌వి.ప్ర‌సాద్ భార్య పేరు సైతం బ‌లిజ కోటాలో తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే ఆకుల స‌తీష్‌కుమార్‌, అదే పార్టీకి చెందిన రాష్ట్ర‌కార్య‌ద‌ర్శి భాను ప్ర‌కాశ్‌రెడ్డి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ‌ర్గానికి చెందిన న‌వీన్‌కుమార్‌రెడ్డి రేసులో ఉన్నారు. మ‌రో ఇద్ద‌రు నేత‌లు కూడా బ‌లంగా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్లు స‌మ‌చారం.ఇక జ‌న‌సేన నుంచి ఇప్ప‌టి వ‌ర‌కైతే అభ్య‌ర్థుల పేర్లు విన‌బ‌డ‌టం లేదు. కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఖ‌చ్చితంగా అభ్య‌ర్థిని నిల‌బెడుతార‌న్న‌ది నిర్వివాదాంశం. ఇక బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెడితే గెలిచే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయి. గ‌తంలో ప‌వ‌న్ అన్న చిరంజీవి ఇక్క‌డి నుంచి ఎన్నికైన నేప‌థ్యంలో ప‌వ‌న్ కళ్యాణ్ కూడా ఇక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఏ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం విశేషం. ఆశావ‌హులు మాత్రం ఎవ‌రికి వారు మాకే టికెట్ వ‌స్తుందంటే మాకే అంటూ ప్ర‌చారం సాగిస్తున్నారు. మొత్తంగా ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కొలువైన నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా అన్‌క్లారిటీ నెల‌కొని ఉండ‌టం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే స‌స్పెన్స్‌కు తెర‌తీయ‌నుంది.

No comments:

Post a Comment