Breaking News

07/02/2019

భూ శుద్ధీకరణ రికార్డు ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్

 పెండింగ్ డిజిటల్ సంతకాలపై మండల రెవెన్యూ సిబ్బంది తీరుపై అగ్రహాం
సిద్ధిపేట, ఫిబ్రవరి 07: (way2newstv.in)
పారదర్శకంగా.. జవాబు దారీగా పని చేద్దాం. విధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హెచ్చరించారు. మండల కేంద్రమైన చిన్నకోడూర్ తహశీల్దారు కార్యాలయంలో గురువారం ఉదయం భూ రికార్డుల శుద్దీకరణ ప్రక్రియ రికార్డులను రికార్డు సిబ్బంది, కంప్యూటరు సిస్టమ్ ద్వారా పొందుపర్చిన అంశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిస్టంలో పొందుపర్చుతున్న రికార్డులు, సవరణలు, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్న డేటా బేస్ ను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి ఆరా తీశారు. 


 భూ శుద్ధీకరణ రికార్డు ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్

పెండింగ్ డిజిటల్ సంతకాలపై, పాత రికార్డులు కూడా మీ వద్ద లేకపోతే.. మీరేం పని చేస్తున్నారని రెవెన్యూ సిబ్బంది పై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. 1బీ, పహాణీ, రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల రిజిష్టర్లను పరిశీలించారు. రికార్డుల పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లి సమాచారాన్ని అందించాలని సూచించారు. పూర్తి చేసిన నివేదికలు ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూర్ తహశీల్దారు సత్యం, డిప్యూటీ తహశీల్దారు రాజిరెడ్డి, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment