హైదరాబాద్, ఫిబ్రవరి 7, (way2newstv.in)
హైదరాబాద్ చందానగర్ లో నగల వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాకాయి వసూలు చేసేందుకు మరో బంగారం వ్యాపారి దేవేశ్ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. సీబీసీఐడీ పోలీసులమని చెప్పి బాధితుణ్ణి కిడ్నాప్ చేసారు. కూకట్ పల్లి శివారులో బాధితుడిని చిదక బాదారు. చివరకు విషయం బైటకి పొక్కడంతో చార్మినార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి పరార్ అయ్యారు. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ ఆర్డర్ల లపై బంగారు ఆభరణాలు తయారు చేయించి విక్రయిస్తుంటాడు. చార్మినార్ ప్రాంతానికి చెందిన బంగారం వ్యాపారి దేవేశ్ నుంచి లక్ష్మణ్ కొనుగోలు చేస్తాడు.
కిడ్నాప్ కథ సుఖాంతం
ఈ వ్యవహారంలో దాదాపు రూ 3.5 లక్షలు బకాయి పడ్డాడు. ఈ డబ్బులు వసూలు చేసేందుకు నగలు వ్యాపారి దేవేశ్ రౌడిషీటర్ల తో వచ్చి లక్ష్మన్ కిడ్నాప్ చేసారు. మొత్తం ఆరు మంది కలసి కిడ్నాప్ కు పాల్పడ్డారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారు లో ఇంటికి వచ్చి కిడ్నాప్ చేశారు. లక్ష్మణ్ బట్టలు విప్పి చిదక బాదడం తో భయపడ్డ లక్ష్మణ్ డబ్బులివిస్తానంటూ ఒప్పుకున్నారు. స్వచ్చంద సంస్థ జనం కోసం ప్రతినిధులతో మాట్లాడించాడు. వారికి కిడ్నాపర్లు తాము సీబీసీ ఐడీ అఫిసర్ లమంటూ దాబాయించారు. దాంతో వారు చందానగర్ పోలీస్లకు పిర్యాదు చేసారు.పోలీసులు రంగం లోకి దిగడంతో కిడ్నాపర్లు గత్యంతరం లేక చార్మినార్ పోలీసు స్టేషన్ లో బాధితుడిని విడిచిపెట్టి పారిపాయారు. చివరకు ముగ్గురు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
No comments:
Post a Comment