Breaking News

02/02/2019

అంగన్ వాడీలకు ఈ పాస్ లతోనే సరఫరా

నల్లగొండ, ఫిబ్రవరి 2, (way2newstv.in)
ఈపాస్‌తో సివిల్ సప్లయ్ యంత్రాంగం స్థానిక చౌక ధరల దుకాణం నుంచి అం గన్‌వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు నేటి నుంచి స్థానిక రేషన్ దుకాణాల నుంచే బియ్యం సరఫరా చేసే లా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం శిశు, సంక్షేమ అధికార యంత్రాంగం కేటాయించబడిన బియ్యానికి సంబంధించిన రిలీజింగ్ ఆర్డర్‌తో ఆయా డివిజన్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా సివిల్‌సప్లయ్ అధికారులు అంగన్‌వాడీ ప్రాజెక్టులకు పంపిస్తున్నారు. అక్కడ నుంచి ఐసీడీఎస్ యంత్రాంగం అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తోంది.  ఇప్పటివరకు సివిల్ సప్ల య్ అధికారులు ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు నిర్దేశించిన కోటా ఆధారంగా రిలీజింగ్ ఆర్డర్ అనుసరించి ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టులకు రైస్ సరఫరా చేయగా ఇకనుంచి స్థానిక రేషన్ దుకాణాల నుంచే అం గన్‌వాడీ వర్కర్లు రైస్ తీసుకునే సౌక ర్యం కల్పించారు. 


అంగన్ వాడీలకు ఈ పాస్ లతోనే సరఫరా

ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త సంబంధిత గ్రామ రేషన్ దుకాణంలో ప్రతినెల మొదటి పక్షం లో కేటాయించిన బియ్యాన్ని తీసుకునే వెసులుబాటు ను కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 2097అంగన్‌వాడీ కేంద్రాలకు చౌక దరల దుకాణాల నుంచి సరఫరా చేయనున్నారు. పుల్‌స్టాప్ పెడుతూ ఇక నుంచి అంగన్‌వాడీ ప్రాజెక్టులకు పంపకుండా స్థానికంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల ద్వారానే ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టారు.  9 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా వాటి పరిధిలో 2093 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అందులో 18 32 మెయిన్ కేంద్రాలు కాగా 261 మినీ కేంద్రాలు. ఆయా కేంద్రాల్లో 57,438 మంది పిల్లలుండగా 8,912 మంది గర్భిణులు, 8,171 మంది బాలింతలు ఉన్నారు. వీరిలో 6 నెలల నుంచి మూడేళ్ల వయసు కలిగిన పిల్లలకు నెలలో 16 గుడ్లు, రెండున్నర కేజీల బాలామృతం, ఇవ్వనుండగా 3 నుంచి ఐదేళ్ల పిల్లలకు సంపూర్ణభోజనం, రోజుకో గుడ్డు, స్నాక్స్ అందజేస్తున్నారు. ఇక గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజూ గుడ్డుతోపాటు భోజనం, 200 మి.లీ. పాలు అందిస్తున్నారు. ఇవన్ని ప్రస్తుతం జిల్లాలో ఉన్న 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా సరపరా చేస్తున్నారు.

No comments:

Post a Comment