హైదరాబాద్ ఫిబ్రవరి, 20 (way2newstv.in)
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్)పై జరిగిన అగ్ని ప్రమాదం లో ఓ వ్యక్తి కారులో సజీవ దహనమయ్యాడు. అవుటర్‌పై వెళుతుండగా కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో డ్రైవర్ సీట్లో ఉన్న అతడు మంటల్లో కాలిపోయాడు.
అవుటర్‌పై కారు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం
మృతుడి వివరాలు తెలియరాలేదు. కారు దగ్ధమవుతోందన్న సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టీఎస్ 07 జీఎం 4666 నెంబర్ గల కారులో బాహ్యవలయ రహదారిపై బొల్లారం వైపు నుంచి ముత్తంగి వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment