బెంగళూరు ఫిబ్రవరి, 20 (way2newstv.in)
రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ధ విమానాన్ని బుధవారం ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు. సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృందానికి చెందిన వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రఫేల్ యుద్ధ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. నిన్న జరిగిన వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఢీకొన్న విషయం తెలిసిందే.
బెంగళూరు ఏరో షో లోరఫేల్ యుద్ధ విమానం
ఈ ఘటనలో సాహిల్ మృతి చెందగా స్క్వాడ్రన్ లీడర్ తేజేశ్వర్ సింగ్, వింగ్ కమాండర్ విజయ్ శేల్కిలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సాహిల్‌కు నివాళులర్పిస్తూ రఫేల్ యుద్ధ విమానం సాధారణ వేగంతో ప్రదర్శన ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలోనే సూర్య కిరణ్ ఏరోబేటిక్స్ బృందం ప్రదర్శనకు దూరంగా ఉంది.రఫేల్‌తో పాటు తేజస్ కూడా వైమానిక ప్రదర్శనలో పాల్గొంది. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తేజస్‌గా నామకరణం చేసిన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఏరో ఇండియాలో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన రెండు రఫేల్ యుద్ధ విమానాలను గత వారం భారత్‌కు తరలించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో మొత్తం 61 విమానాలు పాల్గొననున్నాయి.
No comments:
Post a Comment