Breaking News

14/02/2019

గాజువాక నుంచే జనసేనాని పోటీ

విశాఖపట్టణం, ఫిబ్రవరి 14, (way2newstv.in)
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ యుద్ధ ప్రాతిప‌దిక‌నే సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఓ వైపు పార్టీలో చేరిక‌లు…మ‌రోవైపు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌…అదే స‌మ‌యంలో తెలంగాణ‌లోని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌….ఇలా జ‌న‌సేన‌లో కొత్త సంద‌డి మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో ఆ పార్టీలో కీల‌క ప‌రిణామం ఒక‌టి చోటుచేసుకుంది. అదే పార్టీలో టికెట్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకోవ‌డం. 


గాజువాక నుంచే జనసేనాని పోటీ

ప‌వ‌న్ ద‌ర‌ఖాస్తు నేప‌థ్యంలో స‌హ‌జంగానే..ఆయ‌న పోటీ చేసేది.జనసేన పార్టీకి ఈ మధ్యనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా తొలి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన పవన్ టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఏదైనా కమిటీ ద్వారానా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. అయితే ఈ ద‌ర‌ఖాస్తు నేప‌థ్యంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.జనసేన స్క్రీనింగ్ కమిటీకి తొలి దరఖాస్తు సమర్పించిన పార్టీ చీఫ్… ఉత్తరాంధ్ర నుంచే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర – తూర్పుగోదావరి జిల్లాలపై ప్రభావం ఉండే నియోజకవర్గాన్ని ఎంచుకునే దిశగా జనసేనాని ఆలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గాజువాక లేదా తూర్పుగోదావరి జిల్లాలోని ఒక సీటు నుంచి జనసేనాని బరిలోకి దిగుతారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది. అయితే, గాజువాక నుంచి పోటీకే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపుతోందన్న సమాచారం ఉంది. రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంతో పార్టీ అధినేతను అక్కడి నుంచే పోటీకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పోటీచేసే సీటుపై వారం రోజుల్లోగా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాలు చేయడానికే తాను వచ్చానని ప్రకటించిన జనసేనాని స్క్రీనింగ్ కమిటీ ఏ నియోజకవర్గం అప్పగిస్తుందనేది తేలాల్సి ఉంది.

No comments:

Post a Comment