నల్గొండ, ఆగస్టు 14,(way2newstv.in)
కోమటిరెడ్డి బ్రదర్స్ టి ఆర్ యస్ పార్టిలో చేరుతారన్న ఉహగానల్ని మంత్రి జగదీష్ రెడ్డి కొట్టి పారేశారు. తనకు తానే చేరడం లేదని తేల్చి చెబుతున్నప్పుడు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. నల్గొండలో జిల్లా ప్రజాపరిషత్ నూతనభవనాన్ని సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు . ఈ సందర్బంగా జరిగిన విలేఖరుల సమవేశంలో మంత్రి మాట్లాడారు. రోజుకో మాట పూటకో చిత్తం చెప్పే బ్రోకర్లు,జోకర్లు,హాకర్లు టి ఆర్ యస్ పార్టికి అక్కరే లేదని ఆయన తేల్చి పారేశారు. మానసిక స్తితి సరిగా లేకపోవడంతో వారు ఎటు పోతున్నారో ...ఏమి మాట్ల్డుతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదన్నారు. అటువంటి వారు చేరాల్సింది టి ఆర్ యస్ పార్టిలో కాదు మానసిక వైద్యుడి దగ్గర అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు .
వారి మానసికస్థితి బాగాలేదు : మంత్రి జగదీష్ రెడ్డి
రాహుల్ గాంధి అంటే ప్రజలు భయాపడుతున్నారు
కాంగ్రెస్ పార్టి అధినేత రాహుల్ గాంధి అంటే ప్రజలు భయపడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ పర్యటనతో అధికార పార్టి బయపడుతుందన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. కాంగ్రెస్స్ పార్టికి ప్రజల్లో ఆదరణ కొరవడిందని ,అటువంటి సమయంలో జరుగుతున్నా రాహుల్ గాంధీ పర్యటనకు జనం రారని గ్రహించిన కాంగ్రెస్స్ నేతలు ఈ తరహ ప్రచారానికి ఓడిగాడుతున్నరన్నారు. ఒకవేళ బయపడితే గియపడితే ప్రజలు బయపడుతారని తెలంగాణా రాష్ట్ర సాధనకోసం జరిగిన తోలి,మలి ఉద్యమంలో వందలాదిమందిని పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్స్ పార్టి నేతగా వస్తున్నా కాంగ్రెస్స్ పార్టి నేత రాహుల్ గాంధి అంటే ప్రజలలో ఇప్పటికి అదే బయం ఉంది ఉంటుందన్నారు.రాహుల్ గాంధి అంటే ఆయన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోనే బయపడరని అటువంటిది తెలంగాణా రాష్ట్రంలో ఎందుకు బ్యాపడుతారంటు మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బ్రోకర్లు జోకర్లు హాకర్లు టి ఆర్ యస్ పార్టీలోకి అక్కరలేదు మతిస్తిమితం తప్పినా వారిని పార్టీలోకి తీసుకుంటే గందరగోళం ఏర్పడుతోంది పూటకోమాట గడియకో చిత్తం కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమతమని అన్నారు. మానసిక స్తితి కోల్పోయిన వారు చేరాల్సింది ఆసుపత్రిలో టి ఆర్ యస్ లో కాదు.రాహుల్ గాంధి అంటే ఉత్తరప్రదేశ్ లోనే ఎవరూ బయపడరు తెలంగాణా లో ఎందుకు బయపడుతారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జరిగిన తోలి,మలిఉద్యమాలలో వందలమందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టికి చెందినా రాహుల్ గాంధి అంటే ప్రజలు బయపడడం సహజమేనని మంత్రి వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రజల ఆదరణ లేని విషయాన్ని గుర్తించిన ఆ పార్టి నేతలు రాహుల్ గాంధి పర్యటన విఫలం అయితే ఆ నెపం తమ మీదకు రాకుండా ఉండేందుకే ఈ ప్రచారం అని ఆరోపించారు.
No comments:
Post a Comment