Breaking News

14/08/2018

ముందస్తు సంకేతాలు ఇచ్చిన కేసీఆర్

హైద్రాబాద్, ఆగస్టు 14, (way2newstv.in)
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులు తరలివచ్చారు. ప్రధానంగా రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో కేసీఆర్ ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతు జీవిత బీమా, గేదెల పంపిణీ పథకాలను ఇప్పటికే ప్రారంబించగా ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. దీంతో పాటు బీసీలకు పూర్తి రాయితీతో రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం పట్ల నేతలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను కేసీఆర్ అప్రమత్తం చేయనున్నట్లు తెలుస్తోంది. సర్వేలో వెనుకంజలో ఉన్నట్లు తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలను వారి పనితీరు మార్చుకోవాలని సూచించనున్నారు. దీంతో పాటు టీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. 



ముందస్తు సంకేతాలు ఇచ్చిన కేసీఆర్

దీనికి అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలలో వేగం పెంచారు. గ్రామసీమలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యవసాయరంగం పురోభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావించారు. స్వయానా రైతు అయిన ముఖ్యమంత్రికి రైతుల బాధలేమిటో బాగా తెలుసు. రైతుకు సర్కారు దన్నుగా నిలిస్తే ఎంత కష్టమైనా చేసి ఉత్పత్తిని పెంచుతారని, అభివృద్ధిలో భాగస్వాములవుతారని గుర్తెరిగారు. అందుకే ముందుగా భూమి సమస్యలను పరిష్కరించడానికి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. ఆ వెంటనే రైతు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి ఇచ్చారు. రైతులు ఏ కారణంతో మరణించినా ఆయా కుటుంబాలకు అండగా నిలువాలని నిర్ణయించిన సీఎం.. కొత్తగా బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. మంత్రులు, అధికారులు, రైతు సమన్వయ సమితి నేతలు.. ఇందులో చురుకైన పాత్ర పోషించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచే అమలుచేయనున్నారు. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో, పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.బడుగువర్గాలు బలపడేలా చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. అన్ని వర్గాల బీసీ ప్రజలు, కులవృత్తులవారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నది. గొల్లకుర్మల ఆర్థిక ప్రగతి కోసం గొర్రెల పంపిణీ చేపట్టింది. గీత కార్మికుల రక్షణకు చర్యలు తీసుకున్నది. చేనేత కార్మికులకు భరోసా ఇచ్చింది. ఎంబీసీల అభ్యున్నతికి చర్యలు తీసుకున్నది. ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలని భావించే బడుగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీయే. ఈ విధంగా బడుగువర్గాలకు ఆర్థికసహాయం అందించే పథకాన్ని ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. లాంఛనంగా ఆరోజు జిల్లాకు వందమంది లబ్ధిదారులకు ఆర్థికసహాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బల్క్‌గా మంచినీటి సరఫరాను పంద్రాగస్టునాడే అందించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని అధికారులు పూర్తిచేశారు. మరోవైపు రాష్ట్రంలోని 12,751 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నెలపాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గ్రామప్రజలందరినీ భాగస్వాములను చేసి స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూడా సీఎం కేసీఆర్ పంద్రాగస్టు నుంచే ప్రారంభించనున్నారుకాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పనులు వాయువేగంతో సాగుతున్నాయిరాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు, కాంగ్రెస్‌కు కేసీఆర్‌ ఈ సందర్భంగా ఎన్నికల సవాల్ విసిరే అవకాశం ఉంది. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. 

No comments:

Post a Comment