Breaking News

21/07/2018

గజ్వెల్ లో మంత్రి జోగు రామన్న పర్యటన

గజ్వెల్,జూలై 21, (way2newstv.in) 
గజ్వెల్ మున్సిపల్ పరిధి లోఅటవీశాఖ మంత్రి జోగురమన్న పర్యటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కేసీఆర్ తలపెట్టిన నాలుగవ విడత హరితహారం లో భాగంగా గజ్వెల్ మున్సిపల్ పరిధిలో 1,00116 చెట్ల ను నాటే కార్యక్రమానికి సంబంధించిన పనులను పరిశీలించారు. అందులో భాగంగా గజ్వెల్ నిర్మిస్తున్న 117 ఎక్టర్ లో నిర్మిస్తున్న అర్బాన్ పార్క్ ను పరిశీలించారు.గజ్వేల్  నియోజకవర్గంలో అటవీ శాఖ ద్వారా జరుగుతున్నట్టు వంటి కార్యక్రమాన్ని సందర్శించామని అన్నారు .తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో 44 శాతం అటవీ భూములు ఉన్నాయని .అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇరవై మూడు శాతం అటవీ సంపద ఉందని అంచనా వేశామన్నారు.తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎక్కడైతే ఫారెస్టు భూమి ఉండి చెట్లు ధ్వంసమైన చోట అక్కడే దృష్టి పెట్టండని మాకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు గట్టి ఆదేశాలు జారీ చేశారు .అందుకోసమే తెలంగాణ మొత్తం మీద అటవీ సంపద పెంచాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో హరితహారం పెద్ద ఎత్తున జరపాలని ఉద్దేశంతోనే గజ్వెల్ మున్సిపల్ పరిధిలో 1,00,116 చెట్లు నాటాలనే సిఎం కెసిఆర్ గారి సంకల్పంతో ఈ రోజు గజ్వేల్లో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి.అలాగే గజ్వేల్ పరిధిలోని సంగాపూర్ రోడ్డులో గల అర్బన్ పార్క్ నూటా 117 హెక్టార్ల విస్తీర్ణంలో జరుగుతుంది.



గజ్వెల్ లో మంత్రి జోగు రామన్న పర్యటన

No comments:

Post a Comment