Breaking News

21/07/2018

‘తోట’కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవటంలో గల అంతర్యమేమిటి?

విజయవాడ జూలై 21  (way2newstv.in) 
లోక్ సభలో అవిశ్వాస తీర్మానం తెలుగుదేశంలో పార్టీలో ‘చిచ్చురేపుతోంది’. సభలో టీడీపీపక్ష నేతగా ఉన్న తోట నర్సింహాంకు కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వకపోగా…చర్చలో ఆయనకు  ఒక్కసారి కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవటం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ సంఘటనఫై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై ఎంపీలు భగ్గుమంటున్నారు. లోక్ లోక్ సభలో పార్టీ నాయకుడిగా ఉన్న  తోట నర్సింహాంతో పోలిస్తే గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు తొలిసారి ఎంపీలే. తోట నర్సింహాం గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ కొత్త ఎంపీలతో పోలిస్తే తోట నర్సింహాం ఎంతో సీనియర్. అలాంటిది ఆయనకు కనీసం నోటీసు ఇచ్చే ఛాన్స్ ఇవ్వకపోవటం ఒకెత్తు అయితే..పార్టీ తరపున మాట్లాడేవారి జాబితాలో ఆయన పేరు కూడా ఉండకపోవటం పెద్ద దుమారమే రేపుతోంది.అంటే అసలు తోట నర్సింహాంకు ఏ కోణంలో ఈ పదవి ఇఛ్చారు. పదవి ఇఛ్చినప్పుడు గౌరవించాలి కదా?. మరి పదవి ఇచ్చి ఏపీకి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏకంగా సభలో ఉన్న పార్టీ నాయకుడిని విస్మరించటం కంటే దారుణం ఏముంటుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానాంచారు. అంతే కాదు ఏకంగా కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నేతతో కూడా సభలో మాట్లాడించకపోవటం సరికాదనే అభిప్రాయం విన్పిస్తోంది. వివాదస్పద వ్యాఖ్యలు..పరుషమైన పదజాలం వాడమంటే ఆయన ముందుకు రాకపోవచ్చు కానీ..గత ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ఇఛ్చిన హామీ వంటి అంశాలను ప్రస్తావించేందుకు అశోక్ గజపతిరాజు కూడా వెనక్కిపోయేవారు కాదని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.



‘తోట’కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవటంలో గల అంతర్యమేమిటి?

No comments:

Post a Comment