Breaking News

28/07/2018

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మండవల్లి, జూలై 28, (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు   ప్రతి లబ్దిదారుడు సద్వినియోగం  చేసుకొని  ఆర్థికంగా అభివృద్ది చెందాలని పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు.  శనివారం కైకలూరు నియోజకవర్గం మండలవల్లి మండలం భైరవ పట్నంలో ఏర్పాటు చేసిన సభలో పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ది చెందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో మౌలిక సదుయాలు కల్పిస్తుందని, ఇందులో భాగంగా గ్రామ పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలల అధనపు తరగతి గదులు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, గ్రామం నుండి  గ్రామం వరకు లింక్ రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు.  అదేవిధంగా సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా  అర్హులైన ప్రతి పేదవానికి వృద్యాప్య వితంతు, వికలాంగులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్  గృహనిర్మాణ పథకంలో ఇళ్ళు మంజూరు చేసి పేదవారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మండవల్లి మండలంలో సుమారు 5 కోట్లు 50 లక్షలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలును చేపట్టి అమలు చేసామన్నారు.  సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ  రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్దితో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు.  సుమారు గత నాలుగేళ్ళలో 95 శాతం మేర అనున్న లక్ష్యాలను సాధించామన్నారు.   కొల్లేరులో 7 వేల కోట్ల విలువ గల 21 వేల ఎకరాలు జిరాయితీ, సొసైటీ భూములను తిరిగి రైతులకు అందించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరిగిందని త్వరలో భూములు కోల్పోయిన రైతులకు అందజేస్తామన్నారు. చేపల, రొయ్యల చెరువుల రైతులు మురుగు, ఉప్పునీటిని పంటకాల్వలలోనికి విడిచిపెట్టరాదని  దీనివలన మంచినీటి చెలువుల్లో కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.  అయినా ఎవరైనా పంటకాల్వలోనికి ఉప్పునీటిని విడిచి పెట్టినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నియోజక వర్గంలో వచ్చే ఏడాది నాటికి నూరుశాతం సిసి రోడ్లు పూర్తి చేస్తామన్నారు.  రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటి మంత్రి నారా లోకేష్ కైకలూరు నియోజకవర్గానికి ప్రతి ఇంటికీ కుళాయి అందించాలనే సహృదయంతో 80 కోట్ల రూపాయలను మంజూరు చేసారని త్వరలో ఇంటింటికీ కుళాయి అందిస్తామన్నారు.  కైకలూరు నియోజక వర్గం ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ అందించి పొగరహిత నియోజక వర్గంగా తీర్చి దిద్దామన్నారు. నియోజకవర్గంలో గతంలో 550 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఉంటే గత నాలుగేళ్ళలో 1600 విద్యుత్ ట్రాన్స్ ఫార్మరు ఏర్పాటు చేయడం తో పాటు చిగురుకోట మరియు ఇతర ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు, రైతులకు అందించేందుకు 133య11 కె.వి, విద్యుత్ సబ్ స్టేషన్ లను నిర్మించి లోవోల్టేజి సమస్య అరికట్టామన్నారు. బైరవపట్నం గ్రామ పంచాయితీ పరిధిలో 336 మందికి పెన్షన్లు  సంవత్సరానికి సుమారు            43 లక్షల రూపాయలను అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రామంలో ఎన్టీఆర్ గృహ లబ్దిదారులకు 51 ఇళ్ళ పట్టాలను అందించడం జరిగిందని ఇప్పటికే 37 గృహాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 
మాజీ ఎల్.ఎల్.సి. కమ్మిలి విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి నిత్యావసర వస్తులు సకాలంలో అందించాలన్న లక్ష్యంతో గ్రామాల్లో కూడా పట్టణ ప్రాంతంలో మాదిరిగా చంద్రన్న విలేజ్ మాల్స్ ను ఏర్పాటు చేస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  
తొలుత కైకలూరు మండవల్లి మండలాల్లోని భుజబల పట్నంలో 11 లక్షలతో  అంతర్గత సిసి రోడ్లు, ఎ. రుద్రవరంలో   19 లక్షలతో సిసి రోడ్లు, భైరవ పట్నంలో 95 లక్షలతో 7 అంతర్గత సిసి రోడ్లు నిర్మాణాలు,  భైరవపట్నం నుండి తక్కెళ్ల పాడు వరకు కోటి 80 లక్షలతో రోడ్డు, భైరవపట్నం నుండి చావలిపాడు వరకు కోటి 20 లక్షలతో రోడ్డులకు శంకుస్థాపన, పెరికి గూడెంలో 12 లక్షలతో గ్రామ పంచాయితీ భవనం,7 లక్షలతో అంగన్ వాడీ భవనం, గ్రామంలో రెండు అంతర్గత సిసిరోడ్లు నిర్మాణాలు, సింగనపూడిలో 15 లక్షల రూపాయలతో గ్రామ పంచాయితీ భవనాన్ని పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) కలసి శాసనసభ్యులు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. 
కార్యక్రమంలో  జెడ్ పిటిసి బొమ్మనబోయిన విజయలక్ష్మీ, ఎఎమ్ సి చైర్మన్ సామర్ల శివకృష్ణ, సర్పంచ్ గాదిరాజు అన్నపూర్ణమ్మ, యంపిపి సాకా జసింత, మాజ సర్పంచి దుక్కిపాటి రామారావు,  మాజీ జెడ్ పిటిసి  పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గా ప్రసాద్, తాహసిల్థారు మధుసూధనరావు, యంపిడివో పార్థసారధి, ఇతర శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment