Breaking News

28/07/2018

నిలిచిపోయిన వైద్య సేవలు

హైద్రాబాద్,జూలై 28, (way2newstv.in) 
జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తెలంగాణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల బంద్‌కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఏపీ, తెలంగాణలోనూ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్యసేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు నర్సింగరెడ్డి తెలిపారు. జాతీయ వైద్య క‌మీష‌న్ బిల్లును పార్ల‌మెంటులో పెట్ట‌డాన్ని ఐఎంఏ(ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్) తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ప్రైవేటు మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ఉన్న మేనేజ్‌మెంట్ కోటాను ఇంకా పెంచే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఐఏంఏ ఆరోపిస్తోంది. ఇదే విధంగా వైద్య క‌మీష‌న్ బిల్లు వెనక్కు తీసుకోక‌పోతే వారం రోజుల పాటు అయినా ఆసుప‌త్రుల‌ను బంద్ చేస్తామ‌ని ఐఎంఏ స‌భ్యులు హెచ్చరిస్తున్నారు. నిలిచిపోయిన వైద్య సేవలు

No comments:

Post a Comment