Breaking News

28/07/2018

కేంద్ర నిధులే వాడుతున్నారు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్, జులై 28, (way2newstv.in)    
కేంద్రం నిధులు మినహా గ్రామాల అబివృద్ది కి రాష్ట్ర నిధులు రాకపోవడం దురదృష్టకరం. మన ఊరు మన ప్రణాళిక పట్టాలెక్కలేదు. ఉపాధి హామీ, 14 వ ఆర్థిక సంఘం నుండి మాత్రమే వస్తున్నాయి. రాష్ట్రం నుండి ఒక్క రూపాయి ఇవ్వకపోగా, పంచాయతీ నిర్వహణ కు కూడా 14 వ ఆర్థిక సంఘం నిధులే వాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. కుట్ర పూరితంగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. 2016 లో సుప్రీం తీర్పు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు తొలగించి.. కొత్త బీసీ జన గణన  చేయాలన్నది. బీసీ ల మీద ప్రేమ ఉంటే హైకోర్టు ఉత్తర్వులు రాగానే జన గణన చేసింటే ఈ పాటికి పంచాయతీ ఎన్నికలు జరిగేవి. 2017 లోనే అదనంగా బీసీ గురుకులాలు.. 2018 విద్యా సంవత్సరంలో తెరుస్తా అని ఇప్పుడు 2109 ..20 కి అంటున్నావు.. నీ ప్రకటన మీద నీకే పట్టు లేదని అయన విమర్శించారు. సర్పంచ్ ఉండగానే సెక్రటరీ అందుబాటులో లేడు ఇప్పుడెలా ఉంటాడు.. నియామకం చేస్తే 6 నెలల ముందే మేలుకోవాల్సిందని అన్నారు. పారిశుధ్య కార్మికులకు 5000 కనీస వేతనం అని ఉత్తర్వులు ఇచ్చి అమలు చేయడం లేదు.. 99 శాతం దళితులు వారికి కూడా ఇవ్వలేరా?  180 కోట్లు లేవా? సమగ్ర కుటుంబ సర్వే లో అన్ని వివరాలు ఉన్నాయి అన్నారు మరి బీసీ జనాభా లేదా అందులో అడ్వొకేట్ జెనరల్ లేని రాష్ట్రం తెలంగాణా ఒక్కటే. సర్పంచ్ ల కె పర్సన్ ఇంచార్జి ఇవ్వాలని అయన అన్నారు.



కేంద్ర నిధులే వాడుతున్నారు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

No comments:

Post a Comment