Breaking News

02/07/2018

ప్రకాశంలో పడకేసీన వ్యవసాయం

ఒంగోలు, జూలై 2, (way2newstv.in)
తొలకరి ప్రారంభమై ఏరువాక వచ్చింది. అయినప్పటికీ ఇంత వరకూ చినుకు జాడేలేదు. వర్షం పడిఉంటే ఈ పాటికే రైతులు బెట్ట దుక్కులను దున్ని సాగుకు సిద్ధం చేసేవారు. వర్షం పడని కారణంగా రైతులు నేటికీ దుక్కుల దున్నకాలు ప్రారంభించలేదు. దుక్కులు దున్నేందుకు అవరసమైన వాన కోసం రైతులు ఆకాశం వైపు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత పక్షం రోజులుగా ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి. 



 ప్రకాశంలో పడకేసీన వ్యవసాయం

అయితే కొద్దిపాటి జల్లులకే వానకే పరిమితం అవుతుంది. చిరుజల్లుతో ఎలాంటి ప్రయోజనం లేక రోజురోజుకు వానపై రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నవి. ఖరీప్‌ సాగుకు ముందస్తుగా తొలకరి వానలతో రైతులతో భూమిని దున్ని సిద్ధం చేస్తారు. అననుకూల వాతావరణం కారణంగా ఎడ్లు, అరకలు, ట్రాక్టర్లు చావిడిలకే పరిమితమయ్యాయి. వాతావరణం ఇంకొద్దిరోజులు ఇలానే కొనసాగితే ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్ధకమే.ఇంకొల్లు పరిసర ప్రాంతాలలో గత ఎనిమిది నెలలుగా వర్షం పడిన జాడ లేదు. గత రబీకి ముందు అక్టోబరులో వర్షం పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం ఒక మోస్తరు వాన కూడ కురవ లేదు. అప్పుడు ఆకాశం మబ్బులు కమ్మి చిరుజల్లులు పడుతున్నాయి. అవి ఎందుకు సరిపోవడం లేదు. వర్షాభావం కారణంగా పశువులు, జీవాలకు గ్రాసం దొరక్క అల్లాడుతున్నాయి. ఈ ఎడాదైనా సకాలంలో వర్షం పడి వాగులు వంకలు,గట్లు కొంచమైన పచ్చబడితే పశువులకు గ్రాసం దొరుకుతుందని పశుపోషకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. 

No comments:

Post a Comment