Breaking News

11/07/2018

తెలివితక్కువ స్నేహితుడి కంటే - తెలివైన శత్రువే మిన్న...

విజయవాడ జూలై 11 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో 2014 లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి గట్టి పోటి ఇచ్చి త్రుటిలో అధికారం కోల్పోయిన వైఎస్ ఆర్ సిపి ఇప్పుడు బలం పుంజుకుంటోంది. ఆ పార్టీ అధినేత జగన్ తన పాదయాత్రలతో ముఖ్య  మంత్రి చంద్ర బాబు నాయుడు ఫై వ్యతిరేకతను  కలిగించడం లో కొంత మేర సఫలీ క్రుతుడైనాదని చెప్పవచ్చు. దీనితోప్రజలతో పాటు నాయకులు కూడా తమ నాయకుడిపై అసహనంతో ఉన్నారు. రాజు తమ వాడే కదా ఇక తమ జిల్లాకు ఎదురులేదు అనుకున్న రాయలసీమ ప్రజలను చంద్రబాబు నాయుడి పాలన మరోసారి వెక్కిరించింది. రాయలసీమలోని టిడిపి నాయకులు భారీగా వైఎస్ ఆర్ సిపి తీర్దం పుచ్చుకునేందుకు సిద్దపడుతున్నట్టు సమాచారం.ఇక నారా లోకేష్ చేసే తల తోక లేని వాగ్దానాలతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్టు సమాచారం. 



తెలివితక్కువ స్నేహితుడి కంటే - తెలివైన శత్రువే మిన్న...

తెలివితక్కువ స్నేహితుడి కంటే - తెలివైన శత్రువే మిన్న అన్నట్టు... లోకేష్ కంటే  జగన్ మిన్న అన్నట్టుంది టిడిపి నాయకుల ఆలోచన.ఇటు ఉత్తరాంధ్రలో కూడా అధికార పార్టీ నుంచి వలసలు జోరుగానే ఉన్నాయి. వైఎస్ ఆర్ సిపిలోకి క్షేత్రస్దాయిలో చేరికలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. .నెల్లూరు జిల్లకు చెందిన ఆనం కుటుంబ సభ్యులు ఇప్పటికే వైఎస్ ఆర్ సిపి తీర్దం పుచ్చుకుంటున్నట్టు సమాచారం. అటు బిజేపి నుంచి కూడా వలసలు ప్రారంభమయ్యాయి.జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ పై ఆయన యువసేనకు నమ్మకం పోతున్నది. అసలు వచ్చే ఎన్నికలలో ఆయన పోటి చేస్తారో - లేక చివరి నిమిషంలో గతంలోలా తప్పుకుంటారో తెలియని అయోమయ స్ధితిలో ఉన్నారు.ఇటువంటి సమయంలో జనసేన జండా కంటే వైఎస్ ఆర్ సిపి జండా పట్టుకుంటే మంచిదని ఆంధ్రప్రదేశ్ లో యవత భావిస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికలు జగన్కు బాగా కలసి వచ్చేట్టున్నాయి. వివిధ జిల్లాల్లో జగన్ చేస్తున్న పాదయాత్రలకు ప్రజలు వేలు - లక్షల్లో రావడమే కాకుండా ఆయన ప్రసంగాలకు జై కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా జరిపిన సర్వేలో కూడా జగన్కు అనుకూల తీర్తే వచ్చిందని అంటున్నారు. దీంతో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం నాయకులే అంటున్నారు. 

No comments:

Post a Comment