ముంబై, జూలై 7 (way2newatv.in)
సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మిక్స్డ్ టాక్ పొందిన ఈ సినిమా వసూళ్ల విషయంలో మాత్రం సత్తా చూపిస్తోంది. తొలి వీకెండ్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును రీచ్ అయిన ఈ సినిమా ఇప్పుడు రెండువందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్టుగా తెలుస్తోంది. గురువారంతోనే ఈ సినిమా 202 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. గ్రాస్ వసూళ్ల విషయంలో ‘సంజూ’ రెండు వందల కోట్ల రూపాయల మార్కును దాటినట్టుగా తెలుస్తోంది.
200 కోట్లు దాటిన సంజు
ఆరో రోజు బుధవారం ఈ సినిమాకు 18 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, ఏడో రోజు గురువారం 15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయని సమాచారం. స్థూలంగా రెండు వందల కోట్ల రూపాయల మార్కును దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వీకెండ్లో ఈ సినిమా మరిన్ని భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ లేకపోవడంతో ‘సంజూ’కు దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు దక్కవచ్చు.ప్రీ రిలీజ్ మార్కెట్లో ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసింది. డిస్ట్రిబ్యూటర్ల షేర్ల ప్రకారం చూసుకున్నా ‘సంజూ’ ఇప్పటికే సేఫ్ జోన్లోకి వచ్చిందని.. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచుతున్న ప్రాజెక్టుగా ఈ సినిమా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు మరింత రన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో సంజూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండవచ్చు. మరో విశేషం ఏమిటంటే.. రణ్‌బీర్ కపూర్ కెరీర్లో తొలి రెండు వందల కోట్ల రూపాయల సినిమా ఇది
No comments:
Post a Comment