Breaking News

25/01/2020

శీనన్న ఆగ్రహానికి కారణం ఏంటీ చెప్మా

నిజామాబాద్, జనవరి 25, (way2newstv.in)
సీనియర్ నేత డి.శ్రీనివాస్ అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కవ్విస్తున్నారు. కాలు దువ్వుతున్నారు. కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. అప్పటికయినా తనపై సస్పెండ్ వేటు పడుతుందేమోనని శీనన్న నమ్మకం. డి.శ్రీనివాస్ ను గత ఏడాదిన్నరగా అధికార పార్టీ దూరంగా పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యుడిగా పంపినా నిజామాబాద్ జిల్లాల్లో గ్రూపులు సృష్టిస్తున్నారని డిఎస్ పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు.అందుకే ఆయనను 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే పక్కన పెట్టారు. నిజామాబాద్ జిల్లా నేతల చేత తీర్మానం చేసి మరీ తన వద్దకు తెప్పించుకున్నారు. 
శీనన్న ఆగ్రహానికి కారణం ఏంటీ చెప్మా

డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేసి మరీ కేసీఆర్ కు పంపారు. అయినా ఏడాదిన్నరగా ఆయనపై చర్యలు తీసుకోలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే డీఎస్ రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడిగా కొనసాగుతారు.అందుకే డీఎస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ నుంచి పోటీ చేసిి విజయం సాధించారు. తనకు, తన కుమార్తెకు వ్యతిరేకంగానే డీఎస్ అరవింద్ ను బీజేపీలోకి పంపారన్న ఆగ్రహం కూడా టీఆర్ఎస్ లో ఉంది. అందుకే ఆయనను ఊగిసలాటలోనే ఉంచారు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. అలా అని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. డీఎస్ పై పార్టీ అనధికార బహిష్కరణ విధించింది.దీంతో డి.శ్రీనివాస్ ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ కుటుంబంపై తొలిసారి విమర్శలకు దిగారు. తండ్రి, కొడుకు, కూతురి కోసమే తెలంగాణ ఏర్పడిందని హార్ష్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ ను వీడి రాజకీయంగా జీవితంలో పెద్ద తప్పు చేశానని డీఎస్ అన్నారు. అంటే కేసీఆర్ తో కయ్యానికే డీఎస్ డైరెక్ట్ గా దిగినట్లు స్పష్టమవుతోంది. మరి కేసీఆర్ ఇప్పటికైనా తనకు తిక్కరేపిన డీఎస్ ను సస్పెండ్ చేస్తారో? లేదో? చూడాలి.

No comments:

Post a Comment