విజయవాడ జనవరి 28 (way2newstv.in)
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. నేడు ఉదయం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సీఎం రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు శుభలేఖ అందించారు.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అక్కడ ఉన్నారు.
కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సీఎం రమేశ్
ఇటీవలే రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తాళ్లూరి రాజా కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం భారత్ నుంచి అతిథులు వెళ్లేందుకు సీఎం రమేశ్ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment