Breaking News

01/01/2020

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య లొల్లి

ముంబై, జనవరి 1 (way2newstv.in )
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. పక్కా హిందుత్వ నినాదం, ప్రాంతీయ వాదంతోనే ఏర్పడిన శివసేన అదేపంధాలో నిలదొక్కుకోవాలని చూస్తుంది. ఇందుకు ఉదాహరణే బెళగావి వివాదం. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెళగావి ప్రాంతం తమదేనంటూ ఉద్ధవ్ థాక్రే కొత్త పంచాయతీకి తెరదీశారు. గత ఐదేళ్లపాటు బీజేపీ సర్కార్ లో భాగస్వామిగా ఉన్నప్పుడు పట్టించుకోని ఉద్ధవ్ థాక్రే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత బెళగావి వివాదాన్ని తెరపైకి తెచ్చారు.ఇందుకోసం కమిటీ కూడా వేశారు. ఏకనాధ్ షిండే, చగన్ భుజబుల్ తో వేసిన కమిటీ నిజనిర్ధారణ చేస్తుందని ఉద్ధవ్ థాక్రే చెబుుతన్నారు. దీనిపై న్యాయస్థానంలో కూడా పోరాడేందుకు ఉద్ధవ్ థాక్రే సిద్ధమయ్యారు. నిజానికి బెళగావి భూవివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతుంది. 
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య లొల్లి

అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ పంచాయతీకి ఏ ముఖ్యమంత్రి పూనుకోలేదు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఇష్టం లేకనే వారు ఈ తేనెతుట్టె కదపలేదు.నిజానికి బెళగావి ప్రాంతంలో మరాఠీ మాట్లాడే వారు అధికంగానే ఉన్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో నివసిస్తుంది మరాఠాలే. మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటం, కర్ణాటక పరిధిలోనే కొనసాగుతుండటంతో ఎన్నడూ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అప్పుడప్పుడు ఆందోళనలు తలెత్తినా కట్టడి చేశారే కాని రెచ్చగొట్టలేదు. అయితే తొలిసారి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత బెళగావి వివాదాన్ని స్వయంగా రేపారు. ఇందుకు ప్రత్యేక కారణం వేరే ఏమీ లేకపోయినా ప్రాంతీయ భావాన్ని మహారాష్ట్రలో బలంగా ఏర్పరచడం కోసమేనని చెబుతున్నారు.అయితే కన్నడనాట బెళగావి వివాదం చిచ్చురేపింది. బెళగావి ఎప్పటికీ తమదేనంటూ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాము అంగుళం స్థలం కూడా వదిలిపెట్టేది లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, కన్నడ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ల సవాళ్లతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో బెళగావి వివాదం సెంటిమెంట్ గా మారింది. ఉద్ధవ్ థాక్రేతో ఢీకొట్టేందుకు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. దీనిపై మహాజన్ ఆయోగ్ ఇప్పటికే స్పష్టం చేసిందని, భూభాగాల మధ్య వివాదం సృష్టించవద్దని యడ్యూరప్ప కోరుతున్నారు.

No comments:

Post a Comment