Breaking News

10/01/2020

పోసానిపై పృధ్వీరాజ్ ఫైర్

హైద్రాబాద్, జనవరి 10  (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్‌లని నోరు పారేసుకున్న ఎస్వీబీసీ చైర్మన్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీపై ఫైర్ అయ్యారు పోసాని కృష్ణమురళి. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని రాజధాని కోసం ఇచ్చిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్‌లని అనడం సిగ్గుచేటు అని వెంటనే పృథ్వీ రైతులకు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని. పోసాని.. పృథ్వీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతులు అంటే ఎప్పుడు మట్టిబట్టలతోనే ఉండాలా? అలా ఉంటేనా వాళ్లు రైతులా? ఖరీదైన బట్టలు, బంగారం వేసుకుంటే వాళ్లు రైతులు కాదా? కమ్మ వాళ్లే దిగజారిపోయారా? కమ్మవాళ్లే పెయిడ్ ఆర్టిస్ట్‌లా? ఇది ఎంత దరిద్ర్యం. మీ లాంటి వారివల్లే.. ప్రజల్లో ఎంతో సేవాభావంతో బతుకుతున్న జగన్ లాంటి వాళ్లు, వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిపోతుంది. మీకు జగన్ పదవి ఇచ్చారు. భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అన్నట్టుగా మీకు ఓ ఛానల్‌కి చైర్మన్‌గా పదవి ఇచ్చారు.
పోసానిపై పృధ్వీరాజ్ ఫైర్

 ఆ సేవ చేసుకోండి.నీకు మాట్లాడడం రాకపోతే.. మాట్లాడటం వచ్చిన వాళ్లు మాట్లాడతారు. నీ అంత నీచంగా మాట్లాడరు. ఎన్టీఆర్, చంద్రబాబుల వల్ల కమ్మవాళ్లు బతకడం లేదు.. ఆత్మ గౌరవంతో వాళ్లు మంచిగా బతుకున్నారు. వాళ్లను నువ్వు ఇప్పుడు రోడ్డు మీదికి ఈడ్చావు. పృథ్వీ నువ్వే వాళ్లను అగౌరవపరిచావు. ఫ్యాంట్‌లు షర్ట్‌లు వేసుకుని ధర్నాలు చేస్తున్నారని అనడం సరికాదు. మూడు పంటలు పండించే వాళ్లు మెడలో మంగళసూత్రం వేసుకోకూడదా? చేతిలో సెల్ ఫోన్ ఉంటే వాళ్లు రైతులు కాదు.. ఈ కాలంలో ఎవరిదగ్గర సెల్ ఫోన్ లేకుండా ఉంటుంది. మా ఇంట్లో పనిచేసే మనిమనుషులకు కూడా సెల్ ఫోన్ ఉంది. రైతులు ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా అర్హులు కారా? అందరూ అడుక్కుతినేవాళ్లే ఉంటారా?ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అమరావతి ఆడపడుచులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ నీచమైన కామెంట్స్ చేసిన పృథ్వీ వెంటనే భేషరుతుగా క్షమాపణ చెప్పాలి. జగన్ ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకే ఇలాంటి వాళ్లు ఉన్నారని వీళ్ల వల్ల పార్టీకి నష్టం వస్తుంది. సీఎం జగన్ కుల, మతాలకు పోకుండా అందరికీ సమన్యాయం, సమపాలన అందిస్తుంటే.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుల రాజకీయాలను పాల్పడూ వాళ్లను రెచ్చగొడుతున్నారు. మన ప్రతిపక్ష నాయకుడు ఎలాంటి వాడో తెలుసు కదా.. ఇలాంటి వాటిని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఐదేళ్ల ప్రభుత్వాన్ని ఆర్నెళ్లు కాకుండానే భ్రష్టుపట్టిస్తున్నాడు. కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, దళితులు లాంటి భేదాలు చూడకుండా జగన్ పాలన చేస్తున్నారు. అలాంటి జగన్ గారిని అన్ పాపులర్ చేస్తున్నావ్ పృథ్వీ.నీకు దమ్ముంటే చంద్రబాబు తప్పుల గురించి మాట్లాడు.. అంతేకాని అమరావతి ఆడపడుచులని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటావా?. జగన్ మోహన్ రెడ్డిగారిని ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గాడు అంటూ మాట్లాడుతున్నారంటే నీ లాంటి వారివల్లే. నేను జగన్‌ని ప్రేమించే వ్యక్తిగా ఇది మాట్లాడుతున్నా. ఏది ఏమైనా పృథ్వీ మాట్లాడింది కరెక్ట్ కాదు.. ఆయనపై నాకు ఎలాంటి కక్షా లేదు. కేవలం రైతులను చులకను చేసి మాట్లాడటమే నాకు నచ్చలేదు. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంటే.. ఆయన కించపరిచిన అమరావతి ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని అప్పుడే భగవంతుడు క్షమిస్తాడు’’ అంటూ పృథ్వీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పోసాని. కాగా పోసాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

No comments:

Post a Comment