Breaking News

12/12/2019

గొల్లపూడి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ డిసెంబర్ 12, (way2newstv.in):
సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి  కొనియాడారు. తెలుగు సాహిత్యం పై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్ధేశనం చేసాయని ముఖ్యమంత్రి అన్నారు. మారుతీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గొల్లపూడి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

No comments:

Post a Comment