తుగ్గలి డిసెంబర్ 12 (way2newstv.in)
పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని మద్దికేర మరియు తుగ్గలి మండలంలోని ప్రాథమిక వైద్యశాలలను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్యశాలలో గల వసతులను గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు.అదేవిధంగా మద్దికేర లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాలలో గల సౌకర్యాలను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్
తుగ్గలి లోని ప్రాథమిక వైద్యశాల నందు ఆయుర్వేద వైద్యులు లేరని కలెక్టర్ కు సిబ్బంది తెలియజేశారు.అదేవిధంగా తుగ్గలి ప్రాథమిక వైద్యశాల నందు మరుగుదొడ్ల వసతి లేదని తెలియజేశారు.అదేవిధంగా ప్రాథమిక వైద్యశాల నందు రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ ను ఏర్పాటు చేయాలని సిబ్బంది కలెక్టర్ కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ బాల గణేష్,తహసిల్దార్ వెంకటలక్ష్మి,ఎండిఓ వీర రాజు,ఏపీఓ రాజు నాయక్,మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ మండల స్థాయి అధికారులు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment