తుగ్గలి డిసెంబర్ 12 (way2newstv.in)
తుగ్గలి మండల పరిధిలోని లింగనేని దొడ్డి గ్రామంలో వెలసిన ముని రంగనాథ స్వామి తిరునాళ్ళ ఉత్సవాలను ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు.లింగనేనిదొడ్డి గ్రామంలో గద్వాల ముని రంగనాథ స్వామి తిరునాళ్ళ రథోత్సవం సందర్భంగా ఎద్దుల బండలాగుడు పోటీలను మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి తనయుడు ఉప్పరపల్లె సింగిల్ విండో ప్రెసిడెంట్ ప్రహ్లాద్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి మనవడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మోహన్ రెడ్డి ఎద్దులు బండలాగుడు పోటీలను ప్రారంభించారు.
ఘనంగా ముని రంగనాథ స్వామి తిరునాళ్ళ ఉత్సవాలు
ముని రంగనాథ స్వామి దర్శనం కొరకు నలుమూలల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. అశేష జనవాహిని మధ్య ముని రంగనాథ స్వామి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి నరసింహులు,గిడ్డయ్య,రామాంజనేయులు, రాజు,ప్రతాప్,వీరాంజనేయులు,అల్లం కొండ సుంకన్న,బొందిమడుగుల కె రంగస్వామి ఆచారి, వడ్డే రంగస్వామి,ఆర్ఎస్ పెండేకల్లు మధు మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment