Breaking News

30/12/2019

పల్స్ కోసం సర్వేలు....

హైద్రాబాద్, డిసెంబర్ 30, (way2newstv.in)
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఓటర్ల మూడ్‌‌ ఎట్లుందో తెలుసుకునే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మున్సిపోల్స్లో పోటీకి ఉత్సాహం చూపుతున్న నేతలు కూడా తమకు అందుబాటులో ఉన్న మార్గాల్లో సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. తమ కిస్మత్ ఎట్లుండబోతోందని, గెలుపు ఓటములను నిర్ణయించే అంశాలు ఏమిటని తెలుసుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే పలు దఫాలుగా  సర్వే చేయించికున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు వరకు కూడా సర్వేలు కొనసాగే చాన్స్ కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఆధారంగా ఇక్కడ నమోదయ్యే ఓటు శాతం గెలుపు, ఓటములను ప్రభావితం చేసేంతగా ఉండదని నేతలు లెక్కలు గడుతున్నారు.టీఆర్‌‌ఎస్‌‌  పార్టీ జులై నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతోపాటు మున్సిపాలిటీల వారీగా పరిస్థితులపై సర్వే చేయించినట్టు సమాచారం. 
పల్స్ కోసం సర్వేలు....

ఈ పార్టీ ప్రైవేట్‌‌ సర్వే ఏజెన్సీలతోపాటు ఇంటెలిజెన్స్‌‌, స్పెషల్‌‌ బ్రాంచ్‌‌ పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు నేతల్లో చర్చ నడుస్తోంది. ప్రైవేట్‌‌ ఏజెన్సీలు టెక్నికల్‌‌గా సర్వే చేస్తుండగా, ఇంటెలిజెన్స్‌‌, ఎస్‌‌బీ వర్గాలు ఓవరాల్‌‌ పబ్లిక్‌‌ మూడ్‌‌ను అధికార పార్టీకి చేరవేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ఆయా సర్వే రిపోర్టులను క్రోడీకరించి పబ్లిక్‌‌ మూడ్‌‌ తెలుసుకునే పనిలో అధికార పార్టీ నేతలున్నట్లు తెలిసింది.  ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్యాండిడేట్ల ఎంపిక కోసం సర్వే చేయించినట్లు సమాచారం. ఏ రిజర్వేషన్‌‌కు ఏయే క్యాండిడేట్‌‌ అయితో బాగుంటుందనే కోణంలోనూ ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నట్లు తెలిసింది. శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ నెల 31 నాటికి లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సర్వే చేసి రిపోర్టును అందజేయాలని పార్టీ మున్సిపోల్స్ ఇన్చార్జులకు ఆదేశించినట్లు సమాచారం. ఇతర పార్టీల ప్రభావం ఎలా ఉండనుందన్న కోణంలో కూడా ఇన్చార్జలు సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌‌, బీజేపీ ప్రైవేటు ఏజెన్సీలతో పబ్లిక్‌‌ మూడ్‌‌ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పటికే రెండు విడతల్లో సర్వే చేయించినట్టు సమాచారం. కేవలం మున్సిపల్‌‌ ఎన్నికల కోసమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, స్థానిక పరిస్థితులు, ఇతర అంశాలపైనా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. సర్వేల్లో వచ్చే కచ్చితమైన సమాచారంతోనే ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్టు పార్టీల కేడర్లో చర్చ నడుస్తోంది. ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలూ స్పెషల్‌‌గా సర్వే చేయించినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీపై ఏ మేరకు వ్యతిరేకత కనిపిస్తోంది? తమ పార్టీకి ఉన్న సానుకూలతలు, వ్యతిరేకతలు ఏమిటి? స్థానికంగా ప్రభావం చూపించే అంశాలు ఏమిటి? ఇలా  అనేక కోణాల్లోనూ సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిసింది. సర్వేల్లో వచ్చే సమాచారంలో ఎంత నిజం ఉందనే కోణంలోనూ నేతలు క్రాస్‌‌ చేక్‌‌ చేయిస్తున్నట్టు సమాచారం.ప్రైవేటు సర్వే ఏజెన్సీల్లో పనిచేసి, టెక్నికల్‌‌గా సర్వేపై అవగాహన ఉన్న వ్యక్తులతో కొందరు సీనియర్‌‌ నేతలు అగ్రిమెంట్‌‌ చేసుకొని పాత ఉమ్మడి జిల్లా యూనిట్‌‌గా సర్వేలు చేయిస్తున్నట్టు తెలిసింది. సోషల్‌‌ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండే వ్యక్తులతోనూ కొందరు సర్వేలు చేయించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి సర్వేలు ప్రత్యేకంగా ఒకటీ రెండు మున్సిపాలిటీల పరిధిలోనే జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ రెండు వర్గాల వారికి నేతల నుంచి డిమాండ్‌‌ ఉండటంతో ఆయా పార్టీలు ఇచ్చే ఆఫర్‌‌ను బట్టి ఒక్కరే తమ స్నేహితుల సహాయంతో ఇద్దరు, ముగ్గురికి పనిచేస్తున్నట్టు సమాచారం. మరికొందరు క్యాండిడేట్లు సోషల్‌‌ మీడియాలో పబ్లిసిటీ కోసమే ప్రత్యేకంగా కొందరిని నియమించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు తమకు పనిచేసి పెట్టాలని వారితో ముందుగానే అగ్రిమెంట్  చేసుకుంటున్నారు. ఇలా వందలాది మంది యువకులు సర్వేలు, సోషల్‌‌ మీడియాలో పబ్లిసిటీ పనిలో ఇప్పుడు బిజీ అయిపోయారు.కార్పొరేషన్లు, పెద్ద మున్సిపాలిటీల్లో కీలక పదవులు ఆశిస్తున్న నేతలు స్థానికంగా ఉన్న సోర్సుతో సర్వేలు చేయిస్తుండగా, మరికొందరు సోషల్‌‌ మీడియా కేంద్రంగా పబ్లిక్‌‌ పల్స్‌‌ తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఫలానా డివిజన్, ఫలానా వార్డు తమకు అనుకూలంగా రిజర్వ్‌‌ అయితే పోటీలో ఉంటామని ఫేస్‌‌బుక్‌‌, వాట్సప్‌‌ గ్రూపుల్లో పోస్టింగులతో హోరెత్తిస్తున్నారు. తమ పోస్టింగులకు ఓవరాల్గా వస్తున్న స్పందన ఎట్లుంది? రియాక్ట్‌‌ అవుతున్న వారిలో తమ స్నేహితులు, తెలిసిన వాళ్లు ఎందరున్నారు? ఇతరులు ఎంత మంది ఉన్నారు? అనే  లెక్కలు వేసుకుంటున్నారు. రాజకీయాలకు సంబంధం లేని వారి ప్రతిస్పందన ఆధారంగా తాము ఏమేరకు నెట్టుకురాగలమో అంచనా వేసుకుంటున్నారు.

No comments:

Post a Comment