వరంగల్ డిసెంబర్ 02 (way2newstv.in)
రాజకీయాలకు అతీతంగా గ్రీన్ ఛాలెంజ్ నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రధమ స్తానము లో నిలబెట్టాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేసారు.గత అయిదు సంవత్సరాలక్రితం హరిత హారం కార్యక్రమ ద్వారా చెట్లు పెంచడం ద్వారా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి గ్రీన్ ఛాలెంజ్
అడవులను నరకడం ద్వారా అడవుల్లో నివసించే జంతువులు పట్టణాల్లో గ్రామాల్లో రావడం వాళ్ళ రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అడవులు పెంచడం ద్వారా వీటిని అరికట్టవచ్చని మంత్రి తెలిపారు.రాజ్య సభ్య సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ శాఖ వారు కాకతీయ యూనివర్సిటీలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమం లో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నగర మేయర్ గుండా ప్రకాశరావు యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment