Breaking News

11/12/2019

రిజిస్ట్రేషన్ల శాఖకు సొంత భవనాలు కరువు

హైద్రాబాద్,  డిసెంబర్  11, (way2newstv.in)
రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించే రిజిస్ట్రేషన్ల శాఖకు సొంత భవనాలు కరువయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే ఆ శాఖకంటూ స్థిరాస్తులు పెద్దగా లేవు. అరకొర వసతులు ఉన్న ఇరుకైన ప్రైవేట్‌‌ బిల్డింగ్స్‌‌లోనే ఆఫీసులు నిర్వహిస్తుండడంతో పనులపై వచ్చే ప్రజలు కనీసం నిల్చోవడానికి కూడా స్థలం ఉండడం లేదు. ఉమ్మడి హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి డిసెంబర్‌‌ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా 11,32,062 రిజిస్ట్రేషన్లు జరగగా, రూ.4,293.986  కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య18 లక్షలకు చేరే అవకాశముంది. 
రిజిస్ట్రేషన్ల శాఖకు సొంత భవనాలు కరువు

ఆదాయం ఈ స్థాయిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని141 సబ్‌‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సొంత బిల్డింగ్స్‌‌ ఉన్నవి 20కి మించకపోవడం గమనార్హం. హెచ్‌‌ఎండీఏ పరిధిలో మొత్తం42 ఆఫీసులు ఉండగా6 ఆఫీసులకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.సాధారణంగా ఒక రిజిస్ట్రేషన్‌‌ ఆఫీసులో రోజూ 30 నుంచి -50 రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం జోరుగా నడిచే హెచ్‌‌ఎండీఏ పరిధిలోని సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీసుల్లో మాత్రం రోజుకు100- నుంచి120కిపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏటా రాష్ట్రంలో జరిగే మొత్తం రిజిస్ట్రేషన్లలో సగానికిపైగా రిజిస్ట్రేషన్లు హెచ్‌‌ఎండీఏ పరిధిలోనే జరుగుతున్నాయి. 2018-–2019లో రాష్ట్రవ్యాప్తంగా16 లక్షల రిజిస్ట్రేషన్లు కాగా, వీటిలో సుమారు 10 లక్షల రిజిస్ట్రేషన్లు హెచ్‌‌ఎండీఏ పరిధిలోనివే కావడం విశేషం. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు అన్ని సౌకర్యలాతో సొంత భవనాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగులు చెప్తున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్న రిజిస్ట్రేషన్‌‌ ఆఫీసులకు సౌకర్యాలతో కూడిన సొంత భవనాలను నిర్మించాలని కోరుతున్నారు

No comments:

Post a Comment