న్యూ ఢిల్లీ డిసెంబర్ 4 (way2newstv.in)
దేశ భద్రత అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు.మన దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వాళ్లు సరిహద్దులను రక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మనవాళ్లు సిద్దంగా ఉన్నారన్నారు. దీంట్లో ఎవరికీ అనుమానం అక్కర్లేదన్నారు. చొరబాటు ఘటనలు ఎన్నోసార్లు జరిగాయని, వాటిని ప్రతిసారీ సమర్థంగా ఎదుర్కొన్నట్లు మంత్రి చెప్పారు.
లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ పై స్పష్టమైన అవగాహన లేదు: రాజ్‌నాథ్ సింగ్
లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ పై చైనా, భారత్ మధ్య స్పష్టమైన అవగాహన లేదని, అందుకే కొన్ని సార్లు చొరబాట్లు జరుగుతాయన్నారు. ఒక్కొక్కసారి చైనా వాళ్లు మన భూభాగంలోకి వస్తారని, మరోసారి మన సైనికులు వాళ్ల భూభాగంలోకి వెళ్తుంటారన్నారు.హిందూ మహాసముద్రంలోకి వచ్చిన చైనా నౌకను తరిమినట్లు మంగళవారం నేవీ చీఫ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని, అయితే పాక్‌కు చైనా ఆశ్రయం కల్పిస్తోందని, పాక్‌పై మాత్రం భారత్ తీవ్ర స్వరాన్ని వినిపిస్తుంది, కానీ చైనాపై ఎందుకు సున్నితంగా వ్యవహరిస్తోందని అధిర్ ప్రశ్నించారు.
No comments:
Post a Comment