Breaking News

05/12/2019

తెలంగాణలో 12 ప్రైవేట్ వర్శిటీలు..?

హైద్రాబాద్, డిసెంబర్ 5, (way2newstv.in)
ష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నెలకొల్పేందుకు ప్రక్రియ వేగవంతమైంది. విద్యాశాఖ అధికారులు ఈ దిశగా కసరత్తు ప్రారంభించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు ప్రవేశాల ప్రక్రియను చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయివేటు విశ్వవిద్యాలయాల స్థాపన కోసం ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 20న ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ప్రయివేటు విశ్వవిద్యాలయాల స్థాపన కోసం ఇప్పటి వరకు 12 దరఖాస్తులొచ్చినట్టు సమాచారం. దరఖాస్తులను పరిశీలించి, స్థలాలను సందర్శించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేదా చూసేందుకు ఏడుగురితో నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్‌రెడ్డి ఎక్స్‌అఫిషియో చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. 
తెలంగాణలో  12 ప్రైవేట్ వర్శిటీలు..?

ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూ ఇన్‌చార్జీ వీసీ జయేష్‌రంజన్‌, ఓయూ ఇన్‌చార్జీ వీసీ అరవింద్‌కుమార్‌తోపాటు ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు, జేఎన్టీయూ మాజీ వీసీ రామేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే టెక్‌మహీంద్ర స్థలాన్ని ఆ కమిటీ పరిశీలించింది. త్వరలోనే శ్రీనిధి, రాక్‌ఫిల్డ్‌ స్థలాలు, ఇతర నిబంధనలను పరిశీలించే అవకాశముంది. ఏ పేరుతో విశ్వవిద్యాలయం నెలకొల్పుతున్నారు, కార్పస్‌ఫండ్‌ డిపాజిట్‌ చేశారా? లేదా వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించి ఆమోదముద్ర వేయగానే లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ (ఎల్‌ఓఐ) ఆ వర్సిటీల యాజమాన్యానికి విద్యాశాఖ జారీ చేస్తుంది. దాని ఆధారంగా భవనాల నిర్మాణం, తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన, అధ్యాపకుల నియామకం కోసం ఏర్పాట్లు మొదలవుతాయి.రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన కోసం ప్రభుత్వం ఆగస్టు 20న జీవోనెంబర్‌ 26 ద్వారా మార్గదర్శకాలు ప్రకటించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయం నెలకొల్పాలంటే హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో 20 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 30 ఎకరాల భూమి అవసరమని తెలిపింది. విశ్వవిద్యాలయం స్థాపనకు దరఖాస్తు ఫీజు రూ.50 వేలు చెల్లించిన తర్వాతే దరఖాస్తు ఫారం అందుబాటులోకి వస్తుంది. రూ.10 కోట్లు కార్పస్‌ఫండ్‌, రూ.30 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. ఈ నిబంధనలను ప్రయివేటు విశ్వవిద్యాలయం కోసం దరఖాస్తు చేసిన యాజమాన్యాలు పాటించాయా? లేదా?అన్న విషయాన్ని నిపుణుల కమిటీ పరిశీలించనుంది. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన 30 రోజుల్లో ప్రభుత్వం అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే విద్యాశాఖ ఆ విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు ఎల్‌ఓఐ జారీ చేస్తుంది. ఎల్‌ఓఐ జారీ చేసిన తర్వాతే ఆ విశ్వవిద్యాలయంలో నిర్మాణ, ఇతర పనులు ప్రారంభమవుతాయి. వచ్చే విద్యాసంవ్సరంలో ప్రవేశాలు చేపట్టాలంటే అందుకు అనుగుణంగా కొన్ని విద్యాసంస్థలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. అందులో భాగంగానే ముందస్తుగా దరఖాస్తు చేశాయి. ఎల్‌ఓఐ రాగానే నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన కోసం మరికొన్ని విద్యాసంస్థలు దరఖాస్తు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఇంజినీరింగ్‌ కాలేజీలూ ఉన్నట్టు తెలిసింది.

No comments:

Post a Comment