హైద్రాబాద్, డిసెంబర్ 12 (way2newstv.in)
తాను ఏం చేసిన కొత్తగా ఉండాలని భావిస్తుంటాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుండగా, చిత్రానికి సంబంధించి వినూత్న ప్రచారం చేసుకుంటున్నాడు. తాజాగా తన ట్విట్టర్‌లో ..నాలుగు రోజులు. నలుగురు లవర్స్.. నాలుగు పోస్టర్స్ విడుదల చేయబోతున్నట్టు పేర్కొన్నాడు.
విజయ్ దేవర కొండ.. నాలుగు రోజులు, నలుగురు లవర్స్
సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తుండగా, వారికి సంబంధించిన లుక్స్ ఒక్కో రోజు విడుదల కానున్నాయి. డిసెంబర్ 12న ఐశ్వర్యా రాజేష్, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖన్నా ఇలా వీరి లుక్స్ ప్రతి రోజు సాయంత్రం 6.03ని.లకి విడుదల కానున్నయి. ఇక విజయ్ దేవరకొండ లుక్ ఇప్పటికే విడుదల కాగా, అర్జున్ రెడ్డి లుక్‌లో కనిపిస్తున్నాడనే కామెంట్స్ వచ్చాయి. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు .
No comments:
Post a Comment