Breaking News

13/12/2019

ఆనం మళ్లీ పక్క చూపులు

నెల్లూరు, డిసెంబర్ 13 (way2newstv.in)
నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి. వైసీపీలో ఆయన ఎన్నికల ముందు చేరారు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించి గెలిచారు కూడా. ప్రఖ్యాతి చెందిన రాజకీయ కుటుంబ నేపధ్యం ఉన్న ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. దాంతో ఆరునెలలు గడిచాక మెల్లగా ఆయనలో అసంత్రుప్తి కట్టలు తెంచుకుంది. నెల్లూర్లో మాఫియా ముఠాలు అంటూ ఏకంగా వైసీపీ సర్కార్నే టార్గెట్ చేశారు. ఆనం రామనారాయణరెడ్డి విషయంలో వైసీపీ హై కమాండ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. గీత దాటితే వేటు తప్పదని కూడా హెచ్చరికలు పంపించింది. మరి ఇంతటితో ఆనం రామనారాయణరెడ్డి అసమ్మతి కధ ఆగిపోతుందా. అంటే ఇక్కడే రాజకీయం మొదలైందని అంటున్నారు.జగన్ ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు కానీ ఆయన తన ఎమ్మెల్యేలు, ఎంపీల అసంతృప్తిని సకాలంలో గుర్తించలేకపోతున్నారని అంటున్నారు. 
ఆనం మళ్లీ పక్క చూపులు

జగన్ అటు పార్టీ అధినేతగా ఉన్నా కూడా తగినంత సమయం కేటాయించకపోవడంతో ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారు చాలా మంది ఎంతో కొంత అసంతృప్తితో ఉన్నారని కూడా చెబుతున్నారు. ఇక ఆనం రామనారాయణరెడ్డి విషయమే తీసుకుంటే అధినేత ఆయనకు అమాత్య పదవి ఇవ్వకపోయినా కారణాలు చెప్పి మాట్లాడి ఉంటే సరిపోయేదని కూడా అంటారు. సరే ఇపుడు ఆరు నెలలు కాలం దాటిపోయింది. దాంతో ఆనం రామనారాయణరెడ్డి నోరు విప్పారు. ఆయనకు ఒక విషయం కూడా అర్ధమైంది. ఇలాగే ఉంటే ఏ విధమైన పలుకుబడీ లేకుండా అయిదేళ్ళూ ఎమ్మెల్యేగానే ఉండిపోతామని. దాంతో ఆయన పక్క చూపులు చూస్తున్నార‌ని అంటున్నారు. కమలం నీడకు చేరుతారని కూడా ప్రచారం గట్టిగానే జరుగుతోంది.ఓ విధంగా ఏపీ రాజకీయాల్లో బిగ్ షాట్ గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ని కనుక బీజేపీలో చేర్చుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేగడం ఖాయమని అంటున్నారు. బలమైన రాజకీయ నేపధ్యంతో పాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికార పక్ష నేత ఫిరాయిస్తే ఆ ప్రభావం కచ్చితంగా వైసీపీ మీద ఉంటుందని కూడా అంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో ఇమడలేకపోతున్నారని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో గడిపిన ఆయనకు వైసీపీలో ఉక్కబోతగా ఉందని అంటున్నారు. పైగా ఆయనను పార్టీ అధినాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇగో హర్ట్ అయిందని అంటున్నారు.ఆనం రామనారాయణరెడ్డికి తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ స్వయాన వియ్యపురాలు. ఆమె బీజేపీలో ఎపుడో చేరిపోయారు. ఇక బీజేపీలో ఉన్న పెద్ద నాయకులతో కూడా ఆనం రామనారాయణరెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో ఆనం రామనారాయణరెడ్డి వంటి బడా నేతను తమ వైపు లాగేసుకోవాలని బీజేపీ పెద్దలు కూడా ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తున్నారు. ఆయన కనుక వస్తే ఆ పలుకుబడితో ఏపీలో ఉన్న మరింత మంది సీనియర్లను కమలం వైపుగా నడిపించవచ్చునన్నది ఆ పార్టీ ఆలోచన. అదే విధంగా వైసీపీలో కూడా ఇవాళ కాకపోయినా తరువాత అయినా కూడా చాలా మంది బీజేపీలోకి వచ్చేలా ఆనం చూస్తారని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డి బీజేపీలోకి చేరడం ఖాయమని టీడీపీ నేతలు కూడా జోస్యం చెబుతున్నారు. అయితే ఆయన పార్టీని ధిక్కరించైనా ఎమ్మెల్యే గిరిని కాపాడుకుని చేరుతారా, లేక రాజీనామా చేసి వస్తారా అన్నదే చూడాలని అంటున్నారు

No comments:

Post a Comment