Breaking News

13/12/2019

ఓడిపోయిన ఇద్దరికి యడ్డీ చాన్స్

బెంగళూర్, డిసెంబర్ 13 (way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాను అనుకున్నది చేయదలచుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తన ముఖ్యమంత్రి పదవిని పదిలం చేసిన వారికి మంత్రి పదవులు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఎన్నిక ప్రచారంలోనూ ఇదే హామీ ఇవ్వడంతో యడ్యూరప్ప అనర్హత వేటు పడి గెలిచిన ఎమ్మెల్యేలకు తిరిగి మంత్రి పదవి ఇస్తారని పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓడిపోయిన వారిని కూడా మంత్రివర్గంలో తీసుకోవడంపై పార్టీ లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా 12 చోట్ల బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవాలంటే కేవలం ఆరు స్థానాలు మాత్రమే గెలవాల్సి ఉన్నా పన్నెండు స్థానాల్లో గెలవడంతో ఇక రానున్న మూడేళ్లు యడ్యూరప్పకు తిరుగులేకుండా పోయింది.
డిపోయిన ఇద్దరికి యడ్డీ చాన్స్

 అసంతృప్త నేతలు కూడా ఇక పెదవి విప్పే అవకాశం లేకుండా ఈ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా చేసుకున్నారు యడ్యూరప్ప.దీంతోనే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమిపాలయని ఎంటీబీ నాగరాజు, హెచ్ విశ్వనాధ్ లకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించారు యడ్యూరప్ప. కాంగ్రెస్ లో ఉండి అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కిన వారిలో వీరిద్దరు ప్రధములు. వీరిద్దరూ ఓటమి పాలవ్వడంతో యడ్యూరప్ప వారిని మండలికి అయినా పంపి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హోసెకోట్ నుంచి ఎంటీబీ నాగరాజు, హుణసూర్ నుంచి హెచ్ విశ్వనాధ్ లు పోటీ చేసి ఓడిపోవడంతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వయంగా వారి ఇంటికి వెళ్లి పలకరించడం పార్టీలో చర్చనీయాంశమైంది.ఓటమికి కుంగిపోవద్దని మంత్రిమండలిలో స్థానం కల్పిస్తానని ఈ సందర్భంగా వారిద్దరికీ యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో పార్టీలో సీనియర్ నేతలు యడ్యూరప్పను వారించే ప్రయత్నం చేశారు. వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజాభిప్రాయానికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటున్నట్లవుతుందని యడ్యూరప్పకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే యడ్యూరప్ప మాత్రం ససేమిరా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఇచ్చారని వారిని యడ్యూరప్ప ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. మొత్తం మీద యడ్యూరప్ప తనకు అండగా నిలబడిని వారిని అందలం ఎక్కించేందుకు రెడీ అవుతున్నట్లే కన్పిస్తుంది.

No comments:

Post a Comment