Breaking News

13/12/2019

రాపాక... జంపేనా...

కాకినాడ, డిసెంబర్ 13 (way2newstv.in)
ఉన్న ఒక్క ఒకే ఎమ్మెల్యే కు జనసేన షోకాజ్ నోటీసు ఇచ్చిందన్న వార్తలు వచ్చాయి. రాపాక వరప్రసాద్ కోరుకున్నట్లే జరుగుతోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. శాసనసభలో జనసేనకు ప్రాతినిధ్యం లభించడానికి కారణం రాపాక వరప్రసాద్. ఎన్నికల కౌంటింగ్ చివరి నిమిషం వరకూ విజయం దోబూచులాడినా చివరకు రాపాక వరప్రసాద్ విజయం సాధించారు.అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా తన వంతు పాత్రను పోషించాలని తొలుత నిర్ణయించుకున్నారు. రాజోలు నియోజకవర్గంలో తనను గెలిపించి పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆయన సామాజికవర్గం కావడంతో ఆయన పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 
రాపాక... జంపేనా...

అయితే రాను రాను రాజోలు నియోజకవర్గంలో పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకతను రాపాక వరప్రసాద్ ఎదుర్కొంటున్నారు.నియోజకవర్గం అభివృద్ధి కోసం ఖచ్చితంగా అధికార పార్టీకి ఒకింత అనుకూలంగా ఉండితీరాలని రాపాక వరప్రసాద్ భావించారు. అందుకోసమే ఎమ్మెల్యేగా వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాపాక వరప్రసాద్ పాల్గొని జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇది సహించలేని రాజోలు లోని జనసేన పార్టీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఫ్లెక్సీలు కట్టారు. కానీ రాపాక వరప్రసాద్ జనసేనతో సయోధ్యతతోనే ఉండాలన నిర్ణయించుకున్నా పవన్ కల్యాణ్ సయితం ఆయనను దూరం పెట్టారు.అయితే గత కొంతకాలంగా రాపాక వరప్రసాద్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా రనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లీష్ మీడియంను సమర్థించడమే కాకుండా, జగన్ ప్రభుత్వం అనుసరిస్తునన రైతు సంక్షేమ కార్యక్రమాలను సమర్థిస్తూ ఫ్లెక్సీలను కూడా రాపాక వరప్రసాద్ అనుచరులు ప్రదర్శించారు. ఇది పవన్ కల్యాణ్ ఆగ్రహానికి మరింత కారణమయింది. దీనికి తోడు పవన్ కల్యాణ్ కాకినాడ దీక్షకు కూడా రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. తాను అసెంబ్లీ సమావేశాల్లో ఉండటం వల్లనే హాజరు కాలేకపోతున్నానని రాపాక వరప్రసాద్ చెప్పిినప్పటికీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేశారంటున్నారు. అయితే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయలేదని జనసేన మీడియా విభాగం చెబుతోంది. షోకాజ్ నోటీస్ ఇచ్చినా… ఇవ్వకపోయినా రాపాక వంశీ తరహాలోనే పార్టీని వీడివెళ్లేందుకు రెడీ అయ్యారు. మరి జనసేన రాపాకను మరింత కట్టడి చేస్తూ ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వదిలేసుకుంటుందా? చూసి చూడనట్లు వదిలేస్తుందా? అనేది చూడాలి.

No comments:

Post a Comment