Breaking News

10/12/2019

దిశ కేసు తర్వాత అమల్లోకి జీరో ఎఫ్ఐఆర్

హైద్రాబాద్, డిసెంబర్ 10, (way2newstv.in)
ఇకపై తెలంగాణ పోలీస్ స్టేషన్లలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బాధితులు కోరవచ్చు.. ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదు చేయడానికి బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వస్తే తమ పరిధిలోకి రాదని చెబితే మాత్రం సంబంధిత స్టేషన్‌లో పనిచేసే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేర సంఘటనల పట్ల ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నేర సంఘటనలు జరగకముందే ముందస్తు చర్యలు తీసుకుంటే నేరవృత్తిని తగ్గంచినట్లు అవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 
దిశ కేసు తర్వాత అమల్లోకి జీరో ఎఫ్ఐఆర్

మహిళలకు భద్రత, రక్షణ వంటి విషయాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. పోలీస్, విద్య, మహిళల సంక్షేమ శాఖల పర్యవేక్షణలో మహిళలకు సంబంధించిన వేధింపులు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, అదృశ్యం తదితర అంశాలపై విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేయాలని హోంమంత్రి సూచించారు. రాష్ట్రంలో పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షీ టీమ్‌ను పటిష్టపర్చడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. బాధితులు ఎక్కడైనా ‘హ్యాక్ ఐ’ యాప్‌ను వినియోగించుకోవచ్చునని ఆయన గుర్తు చేశారు. బాధితులు 100, 181, 1098తో పాటు 112 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు. ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా ఆయా స్కూళ్లలోని నోటీసు బోర్డ్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లను చూపించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, క్యాబ్స్‌లపై హెల్‌లైన్ నెంబర్లు ఉండాలని సూచించారు. మహిళల రక్షణ, భద్రత అంశాలపై టీవీ చానల్స్, సార్ట్ ఫిలింలు, స్కైట్స్, స్లైడ్స్‌ల ద్వారా ప్రచారం చేయాలన్నారు. విద్యార్థులు పుస్తకాలపై హెల్ప్‌లైన్ నెంబర్లు ఉండాలని విద్యాసంస్థలను ఆదేశించారు. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్, ప్రభుత్వం కార్యాలయాలు, మెట్రో రైల్వే స్టేషన్లు వద్ద హెల్ప్‌లైన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యార్థులు ప్రత్యేక క్లాసుల కోసం బయటికి వెళ్తుంటే హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆకతాయిలు ఎవరైనా అమ్మాయిలను వెంటపడుతుంటే హెల్ప్‌లైన్ నెంబర్లుకు చెప్పడంతో పాటు పంచాయితీ సెక్రటరీలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

No comments:

Post a Comment