Breaking News

10/12/2019

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న సమీకరణాలు

విజయవాడ, డిసెంబర్ 10  (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో తమ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దేందుకు అమిత్ షా అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన రాజకీయ వ్యూహాలకు ఆయన పదును పెడుతూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఎపి ముఖ్యమంత్రి జగన్ కి అమిత్ షా అపాయింట్మెంట్ లు ఇస్తూ క్యాన్సిల్ చేస్తూ రావడం చర్చనీయంగా మారింది. వైసిపి ఎంపి రఘురామ కృష్ణం రాజు, బిజెపి లో చేరిన టిడిపి సీనియర్ నేత సిఎం రమేష్ వంటివారికి పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ ఇచ్చిన అమిత్ షా ఎపి సిఎం జగన్ విషయంలో దాగుడు మూతలు ఆడటం దేనికి సంకేతం అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతుంది.వాస్తవానికి ఎన్నికల ముందు తరువాత కూడా వైసిపి అధినేత జగన్ కు ఢిల్లీ లో బిజెపి అధిష్టానం రెడ్ కార్పెట్ పరిచింది. ప్రధాని మోడీ నుంచి అమిత్ షా ఇతర కేంద్రమంత్రులు వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోరిన వెంటనే లభించేది.
 తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న సమీకరణాలు

 వారి ఆపాయింట్ మెంట్ దొరికిన తరువాతే ఢిల్లీ టూర్ ఖరారు అయ్యేది. కానీ  నెలరోజులుగా బిజెపి అధిష్టానం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అపాయింట్ మెంట్ లు ఇచ్చి మరి వాటిని క్యాన్సిల్ చేస్తూ ఉండటంతో వైసిపి లో దీనికి కారణాలు ఏమిటన్న చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టిడిపి నుంచి సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ వంటి వారంతా బిజెపి లోకి దూకి టిడిపి పార్లమెంటరీ పార్టీ కాషాయంలో విలీనం అయినట్లు ప్రకటించి ఆశ్చర్య పరిచారు. అయితే ఈ ప్రక్రియ పై భయంతో టిడిపి పోరాటం చేసింది ఏమి లేకపోయింది.గట్టిగా ప్రశ్నిస్తే కేశినేని వంటివారితో గెలిచిన ముగ్గురు లోక్ సభ ఎంపిలు పార్టీని వీడే ప్రమాదం ఉందని తమవారు స్లీపర్ సెల్స్ గా అందులోనే వుంటూ వైసిపి – బిజెపి బంధాన్ని బ్రేక్ చేయాలనే ఆదేశాలు రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు డైరెక్షన్ లో సాగినట్లు గట్టి ప్రచారమే నడిచింది. దీన్ని టిడిపి అధిష్టానం గట్టిగా ఖండించిన పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్ ని కేంద్రంలో రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహాన్ని టిడిపి తన స్లీపర్ సెల్స్ తో దెబ్బతీస్తుంది. దీన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రతి వ్యూహం అమలు చేయడంలో వైసిపి విఫలం అవుతున్నట్లు తెలుస్తుంది. అధికారంలో లేనప్పుడు ఇతర వ్యాపకాలు లేకపోవడంతో విజయ సాయి వంటివారు పూర్తి స్థాయిలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేవారు.కానీ ఇప్పుడు ఒక పక్క పార్టీ లో పరిణామాలు గమనించుకుంటూ మరో పక్క కేంద్రంతో సఖ్యత సాగిస్తూ రావడానికి సమయం చాలడం లేదని అందుకే విజయసాయి లాబీయింగ్ లో వెనుకబడుతున్నారనే ప్రచారం టిడిపి మీడియా లో గట్టిగా ప్రచారం సాగుతుంది. ఢిల్లీ టూర్ లో వున్న జగన్ తన వ్యక్తిగత వ్యవహారాలు చూసే నారాయణ చనిపోవడంతో పర్యటన రద్దు చేసుకుని వెనుతిరిగినా అపాయింట్ మెంట్ దొరక్కే ఆయన వెళ్లిపోయారంటూ టిడిపి మీడియా చాటేస్తుంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా వున్న సమయంలో కూడా ప్రధాని మోడీ అడిగిన వారికి అడగని వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ బాబు ను ఏడాదిన్నర పాటు దూరం పెట్టడం గమనిస్తే బిజెపి ఆటలో ఏపీ నేతలు అరటిపండుగా మారారా అన్నది ఆలోచించాలిసిన విషయమే.

No comments:

Post a Comment