హైదరాబాద్ డిసెంబర్ 26, (way2newstv.in):
సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 5న ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ హైదరాబాద్ లో జరుగు ఉత్తమ మహిళా ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవానికి సాంఘిక సంక్షేమ శాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రికి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వనించారు.ఈ సందర్భంగా ఎస్సీ ,ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన సావిత్రిబాయి పూలే 189 వ జయంతి ఉత్సవాల కరపత్రలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.
సావిత్రిబాయి పూలే 189 వ జయంతి ఉత్సవాల కరపత్రలను ఆవిష్కరించిన మంత్రి
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పెంట. అంజయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రాజబాబు, జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు దుమాల స్వామి, నూనె రమేష్ ,సమ్మయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment