ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిశంబర్ 26(way2newstv.in)
అధికార దుర్వినియోగం చేయడం అనేది కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మునిసిపాల్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.ఓటర్ లిస్ట్, వార్డుల రిజర్వేషన్ లో గోల్ మాల్ జరిగినట్టు జీవన్ రెడ్డి మాట్లాడుతున్నరనిటీఆర్ ఎస్ పార్టీకి ఆ అవసరం లేద ని నొక్కి వాఖ్యానించారు.
అధికార దుర్వినియోగం కాంగ్రెస్ కు వెన్నతోపెట్టిన విద్య
జగిత్యాలలో అంతకన్న అవసరం టిఆర్ ఎస్ కు లేదనే విషయం జీవన్ రెడ్డికి తెలుసేనని,మొన్నటి ఎన్నికల్లో ఒక్క వార్డులో నైనా డిపాజిట్ సంపాదించగలిగారా అని ప్రశ్నించారు.మీ స్వంత వార్డులోనే మీకు కేవలం 21 ఓట్లు వచ్చిన విషయం మరిచారా అని సూటిగా ప్రశ్నించారు.వార్డుల విభజనల్లో గోల్ మాల్ కేవలం కాంగ్రెస్ పార్టీదే అని ఎస్సీలు అధికంగా ఉన్న వార్డులను జనరల్ చేసిన ఘనత మీదే అన్నారు. ఫలితంగా ఎస్సీలు విజయం సాధించి మీకు గట్టిగా బుద్దిచెప్పిన విషయం మరిచారా అని సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో తెరాస నాయకులు బోగ వెంకటేశ్వర్లు, గట్టు సతీష్, డాక్టర్ శైలెందర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment