Breaking News

13/11/2019

డే అండ్ నైట్ టెస్ట్ కు పింక్ ప్రాక్టీస్

కోల్ కత్తా, నవంబర్ 13(way2newstv.in)
రెడ్‌‌బాల్‌‌తో బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌.. మధ్యలో పింక్‌‌బాల్‌‌తో త్రోడౌన్స్‌‌.. నెట్స్‌‌లో రెండు బాల్స్‌‌తో బౌలర్ల బౌలింగ్‌‌.. బంగ్లాదేశ్‌‌తో టెస్ట్‌‌ సిరీస్‌‌ కోసం టీమిండియా మంగళవారం చేసిన కరసత్తులు ఇవి. గురువారం బంగ్లాతో మొదలయ్యే తొలి మ్యాచ్‌‌ కోసం ఇండియా టీమ్‌‌ నెట్‌‌ ప్రాక్టీస్‌‌ను ముమ్మరం చేసింది. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌, స్లిప్‌‌ క్యాచ్‌‌లపై దృష్టిపెట్టింది. ఇక ఈనెల 22 నుంచి ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో జరగబోయే చారిత్రాత్మక ‘పింక్‌‌బాల్‌‌’ టెస్ట్‌‌ కోసం కూడా సాధన చేసింది. బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టర్ఫ్‌‌పై కోహ్లీ తొలి పింక్‌‌బాల్‌‌ డెలివరీని ఎదుర్కోగా, మిగతా టీమ్‌‌మేట్స్‌‌ అతన్ని అనుసరించారు. మామూలుగా పేసర్స్‌‌, స్పిన్నర్స్‌‌, త్రో డౌన్స్‌‌ ప్రాక్టీస్‌‌ను టీమిండియా వరుసగా ఉన్న నెట్స్‌‌లో చేస్తుంటుంది.
డే అండ్ నైట్ టెస్ట్ కు పింక్ ప్రాక్టీస్

అయితే మేనేజ్‌‌మెంట్‌‌ రిక్వెస్ట్‌‌ మేరకు ఈ సెషన్‌‌లో త్రోడౌన్స్‌‌ కోసం వేరే ప్లేస్‌‌ కేటాయించారు. త్రోడౌన్‌‌ స్పెషలిస్ట్‌‌లు రాఘవేంద్ర, నువాన్‌‌ సేనావిరత్నే  పింక్‌‌బాల్‌‌తో వేసిన డెలివరీలను సులువుగా ఆడిన విరాట్‌‌ డిఫెన్స్‌‌కు ప్రాధాన్యమిచ్చాడు. ఆ తర్వాత చతేశ్వర్‌‌ పుజారా బ్యాటింగ్‌‌కు మెరుగులు దిద్దుకున్నాడు. అయితే ఎక్స్‌‌ట్రా పేస్‌‌తో వచ్చిన ఓ బౌన్సర్‌‌ రిజర్వ్‌‌ ఓపెనర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ను బలంగా తాకింది. ఎలాంటి గాయం కాకపోవడంతో మేనేజ్‌‌మెంట్‌‌ ఊపిరి పీల్చుకుంది. తొలి టెస్ట్‌‌, రెండో మ్యాచ్‌‌కు మధ్య రెండు రోజుల సమయమే ఉండటంతో.. ఇండోర్‌‌లోనే ఫ్లడ్‌‌లైట్ల కింద మ్యాచ్‌‌ ప్రాక్టీస్‌‌కు తగిన ఏర్పాట్లు చేయాలని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ మధ్యప్రదేశ్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీసీఏ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇక ద్రవిడ్‌‌ పర్యవేక్షణలో ఎన్‌‌సీఏ ఫ్లడ్‌‌లైట్ల వెలుతురులో పింక్‌‌బాల్‌‌తో జరిగిన పలు ప్రాక్టీస్‌‌ సెషన్స్‌‌లో రహానె, మయాంక్‌‌ అగర్వాల్‌‌, పుజారా, షమీ పాల్గొనడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.పింక్‌‌బాల్‌‌తో మ్యాచ్‌‌ చాలా భిన్నంగా ఉంటుందని టీమిండియా వైస్‌‌ కెప్టెన్‌‌ అజింక్యా రహానె అన్నాడు. రెడ్‌‌బాల్‌‌ కంటే పింక్‌‌బాల్‌‌ను ఆడటం కొద్దిగా ప్రమాదకరమన్నాడు.  అయితే మైండ్‌‌సెట్‌‌, టెక్నిక్‌‌ మార్చుకుంటే ఇది సులువేనని చెప్పాడు. ‘కొత్త పింక్‌‌బాల్‌‌ను కొంచెం లేటుగా ఆడాలి. బంతిని శరీరానికి దగ్గరగా రానివ్వాలి. సీమ్‌‌ మూవ్‌‌మెంట్‌‌లో కూడా చాలా తేడా ఉంటుంది.  ఎన్‌‌సీఏలో మాకు రెండు ప్రాక్టీస్‌‌ సెషన్స్‌‌ లభించాయి. ఇందులో ఒకటి డే అయితే, రెండోది ఫ్లడ్‌‌లైట్స్‌‌ వెలుతురులో ఆడాం. చాలా ఉత్సాహాన్నిచ్చింది. పింక్‌‌బాల్‌‌ను ఎదుర్కోవడం నాకు ఇదే ఫస్ట్‌‌ టైమ్‌‌. మ్యాచ్‌‌ చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది. స్వింగ్‌‌, సీమ్‌‌ మూవ్‌‌మెంట్‌‌పైనే ఎక్కువగా ఫోకస్‌‌ చేయాలి. బంతి శరీరం దగ్గరకు వచ్చే వరకు ఆగి ఆడాలి. అప్పుడే సక్సెస్‌‌ అవుతాం’ అని రహానె పేర్కొన్నాడు.డేనైట్‌‌ టెస్ట్‌‌లో పింక్‌‌బాల్‌‌ను ఎదుర్కోవడానికి బ్యాట్స్‌‌మన్‌‌ టెక్నిక్‌‌ను కొద్దిగా మార్చుకోవాలన్నాడు. రెండు ప్రాక్టీస్‌‌ సెషన్స్‌‌లో ఈ విషయాన్ని గుర్తించామన్న వైస్‌‌ కెప్టెన్‌‌.. ఎన్‌‌సీఏ చీఫ్‌‌ ద్రవిడ్‌‌తో దీనిపై చర్చించామన్నాడు. ‘పింక్‌‌బాల్‌‌పై పట్టు దొరకలేదని స్పిన్నర్లు ఫిర్యాదు చేశారు. కానీ దులీప్‌‌ ట్రోఫీలో కుకాబుర్రా బంతులను వాడారు. మేం ఎస్‌‌జీ బాల్స్‌‌తో ప్రాక్టీస్‌‌ చేశాం. ఈ రెండింటికి పోలిక కష్టం. రెడ్‌‌బాల్‌‌తో పోలిస్తే పింక్‌‌బాల్‌‌ షైనింగ్‌‌ ఎక్కువగా ఉంటుంది. కుకాబుర్రా బంతి బ్యాట్స్‌‌మన్‌‌కు అనుకూలంగా ఉంటుందని చాలా మంది చెప్పారు. కానీ ఎస్‌‌జీ బాల్‌‌ పేసర్లకు చాలా ఉపయోగంగా ఉంటుందని బెంగళూరు సెషన్స్‌‌లో మాకు అర్థమైంది. స్పిన్నర్ల గురించి ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ఏ బాల్‌‌ ఎలా స్పిన్‌‌ అవుతుందో అంచనా వేయలేం. కోల్‌‌కతాలో జరిగే ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో అందరూ పింక్‌‌బాల్‌‌కు అలవాటుపడతారు. మైండ్‌‌సెట్‌‌, టెక్నిక్‌‌ మార్చుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు’ అని ఈ ముంబైకర్‌‌ వివరించాడు.కాలిపిక్క కండర గాయంతో జట్టుకు దూరమైన పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌‌లో పాల్గొన్నాడు. బంగ్లాతో ఆడే టెస్ట్‌‌ టీమ్‌‌లో భువీ లేకపోయినా.. స్కిల్‌‌ సెషన్‌‌ కోసం టీమ్‌‌తో కలిసి సాధన చేశాడు. విండీస్‌‌తో వన్డే సిరీస్‌‌ తర్వాత భువీ.. గాయంతో టీమ్‌‌కు దూరమయ్యాడు. ఎన్‌‌సీఏలో రిహాబిలిటేషన్‌‌ ప్రోగ్రామ్‌‌లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగానే ఇండోర్‌‌కు వచ్చాడు. ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ శ్రీధర్‌‌తో కలిసి క్యాచింగ్‌‌ సెషన్‌‌లో పాల్గొన్న భువీ తర్వాత బౌలింగ్‌‌ చేశాడు. ఫుల్‌‌ రనప్‌‌తో బౌలింగ్‌‌ చేయడంలో కాస్త ఇబ్బందిపడ్డాడు

No comments:

Post a Comment