విజయవాడ, నవంబర్ 13 (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు, ఈ నెల 14న, భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాటం చేస్తూ, 12 గంటల పాటు, ఇసుక దీక్ష చెయ్యనున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. ఈ కార్యక్రమం విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర జరుగుతూ ఉండటంతో, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ , ఈ దీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఈ క్రమంలోనే అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మొన్నటి దాక ఎడమొఖం, పేద మొఖంగా ఉన్న నాయకులు, ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవటం, పక్కపక్కనే కూర్చువటంతో, తెలుగుదేశం కార్యకర్తలు, మొదట ఆశ్చర్యపోయినా, చంద్రబాబు దీక్ష వల్ల, మా నాయుకులు ఇద్దరూ కలిసి పోయారు అంటూ, సంతోషిస్తున్నారు.
బెజవాడ టీడీపీలో ఐక్యతా రాగాలు
వారు ఎవరో కాదు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మరో టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఇసుక దీక్ష, వీరిద్దరినీ మళ్ళీ కలిపిందనే చెప్పాలి.ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నకల తరువాత నుంచి, విజయవాడ టిడిపిలో చిన్న పాటి తుఫాను వచ్చింది. ఎన్నికల ఫలితాలు తరువాత నుంచి, కేశినేని నాని, బుద్దా వెంకన్న ఒకరి పై ఒకరు, విమర్శలు చేసుకున్నారు. ఇదంతా ట్విట్టర్ వేదికగా జరిగింది. అయితే ఈ ట్విట్టర్ యుద్ధం కొనసాగుతూ ఉండటం, ప్రతి రోజు వార్తల్లో విషయం కావటంతో, చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని, ఇరువురికి సర్ది చెప్పారు. అప్పటి నుంచి, ఇరువు నేతలు, ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. అసలు జరిగిన విషయం ఏమిటో, క్లారిటీ లేకపోయినా, ఇద్దరు నేతల మధ్య మాత్రం, తేడాలు గమనించిన క్యాడర్ మాత్రం, అసంతృప్తితో ఉంది. వచ్చే మునిసిపల్ ఎన్నికలకు ధీటుగా ఎదుకోవాల్సిన టైంలో, ఇలా మనలో మనకే ఇబ్బందులు ఉంటే ఎలా అంటూ, కార్యకర్తలు ఆందోళన చెందారు.అయితే, నిన్న అనూహ్యంగా, ఇరువురి నేతలు, ఒకే వేదిక పై కుర్చుని, పక్క పక్కనే కూర్చుని, మాట్లాడుకోవటంతో, ఇరువురి మధ్య మళ్ళీ స్నేహం చిగురించిందని, ఇది పార్టీకే మంచిదని, కార్యకర్తలు అంటున్నారు. సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో నిర్వహించిన టీడీపీ అర్బన్ కమిటీ సన్నాహక సమావేశంలో, ఈ కలయిక చోటు చేసుకుంది. సమావేశం కేశినేని భవన్ లో జరగటం, అక్కడకు, బుద్దా వెంకన్న రావటం, కేశినేని నాని కూడా బుద్దా వెంకన్నతో సఖ్యతగా ఉండటంతో, ఇక నుంచి మళ్లీ అర్బన్ టీడీపీ నాయకులంతా ‘టీమ్ విజయవాడ’గా ముందుకు వెళ్తూ, వచ్చే మునిసిపల్ ఎన్నికల నాటికి, పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తామని, కార్యకర్తలు అంటున్నారు. ఏది ఏమైనా, చంద్రబాబు దీక్ష, ఇరువురి నాయకులను మళ్ళీ ఏకం చెయ్యటం, శుభ పరిణామం.
No comments:
Post a Comment