Breaking News

02/11/2019

మియవాకి విధానంలో...స్వల్ప కాలంలో దట్టమైన అరణ్యాలు సృస్టించవచ్చు

మియవాకి సాంకేతికతతో పెంపకం
అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో   జపాన్ జంగల్
అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో   శ్రీకారం
వి కెన్ మేక్ ఏ చేంజ్ ప్రత్యేక చొరవ
రెండేళ్లలోనే దట్టమైన అడవులు
మియవాకి విధానంలో మొక్కల పెంపకం కు శ్రీ కారం చుట్టిన  కలెక్టర్ కృష్ణ భాస్కర్
సి రిసిల్ల  నవంబర్ 02 ,(way2newstv.in):
ఖాళీ ప్రదేశాలన్నింటినీ తక్కువ సమయంలో  దట్టమైన అరణ్యంలా మార్చేందుకు జపాన్లో బాగా ప్రాచుర్యం పొందిన అకిర మియవాకి విధానం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు .శనివారం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో   వి కెన్ మేక్ ఏ చేంజ్ స్వచ్చంద సంస్థ పాలిటెక్నిక్ కళాశాల సహకారంతో కళాశాల ఆవరణలో మియవాకి సాంకేతికతతో మొక్కల  పెంపకం కు జిల్లాలోనే తొలిసారిగా  శ్రీ కారం చుట్టింది .ఈ విధానంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటి  మియవాకి విధానం లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడతూ  జపాన్లో బాగా ప్రాచుర్యం పొందిన అకిర మియవాకి అనే  సాంకేతికతతో మూడేళ్లలోనే దట్టమైన అడవి రూపొదించ వచ్చునని తెలిపారు . బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రలో మియవాకి టెక్నాలజీతో అడవులను అభివృద్ధి చేసారని , ఇదే తరహాలో ఇక్కడ కూడా అడవులను పెంచేందుకు యువకులతో కూడిన  వి కెన్ మేక్ ఏ చేంజ్ స్వచ్చంద సంస్థ ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు . 
మియవాకి విధానంలో...స్వల్ప కాలంలో దట్టమైన అరణ్యాలు సృస్టించవచ్చు  

ఈ విధానంలో  పర్యావరణ క్షీణత కలిగిన నేలలపై స్థానిక చెట్ల విత్తనాలను నాటి అడవులుగా పునరుద్ధరించవచ్చునన్నారు . భూసారాన్ని పెంచి తేమ ఎక్కువగా ఉండేటట్లు చేసిన తర్వాత గుంపులు గుంపులుగా మొక్కలు నాటితే  చిట్టడవులుగా  మరుతాయన్నారు . ఈ పద్ధతి యొక్క మరొక ప్రయోజనం మియావాకి అడవి, రెండు సంవత్సరాల తోటల తరువాత, స్వయం సమృద్ధిగా మారుతుందన్నారు .  బాహ్య నిర్వహణపై ఆధారపడదని కలెక్టర్ తెలిపారు . ఈ దట్టమైన అడవులు భూగర్భజలాలను నిలుపుకోవటానికి, భూగర్భజల పట్టికలను రీఛార్జ్ చేయడానికి , స్థానిక జీవవైవిధ్యానికి తోడ్పడటమే కాకుండా ఆకుపచ్చ దనం  పెంచడానికి దోహదం చేస్తాయన్నారు . వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి సహాయపడుతునదన్నారు .కాలుష్యాన్ని తగ్గించడానికి , భూగర్భ జలాలను మెరుగుపరచడానికి ఈ విధానం సహాయం చేస్తుందని కలెక్టర్ అన్నారు .వి కెన్ మేక్ ఏ చేంజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లం కార్తిక్ మాట్లాడతూ జిల్లా,హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లా లలో  వి కెన్ మేక్ ఏ చేంజ్ ఆధ్వర్యంలో గత రెండున్నర సంవత్సరములుగా వివిధ కార్యక్రమాలు ( ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేయడం, అనాధలకు చదువుకు ఆర్థిక సహాయం , మెడికల్ క్యాంప్స్ , గుంతలు పూడ్చడం) వంటి సామాజిక కార్యక్రమాలను చేపడుతుందన్నారు . ఇపుడు జపాన్ శాస్త్రవేత్త ఐన మియవాకి  ప్రవేశపెట్టిన మీయవకి ఫారెస్ట్ ని వి కెన్ మాక్ చేంజ్ టీం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయోగాత్మకంగా  చేపట్టిందన్నారు .జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు ,మొక్కల పర్యావరణ శాస్త్ర నిపుణుడు డి. అకిరా మియావాకి ఈ ప్రత్యేకమైన తోటల పద్ధతిని కనుగొన్నారని తెలిపారు .మియావాకి పద్ధతిలో బహుళ లేయర్డ్ మొక్కలను ఒకదానికొకటి దగ్గరగా పండిస్తారని అన్నారు . ఇది సూర్యరశ్మిని భూమికి రాకుండా అడ్డుకుంటుంది మరియు కలుపు మొక్కలు పెరగకుండా నిరోధిస్తుందన్నారు , తద్వారా నేల తేమగా ఉంటుందని పేర్కొన్నారు . దగ్గరగా పంట వేయడం వల్ల మొక్కలు పై నుండి మాత్రమే సూర్యరశ్మిని పొందుతాయని తద్వారా వాటిని పక్కకి కాకుండా పైకి ఎదగడానికి వీలు కల్పిస్తుందన్నారు .ఈ పద్ధతి 20 నుండి 30 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో అటవీ స్థలాన్ని  సృస్తిస్తుందన్నారు . ఈ విధానం తో పోల్చితే  సాంప్రదాయ అడవి అభివృద్ధి చెందడానికి 200 నుండి 300 సంవత్సరాల వరకు పడుతుందన్నారు .అలాగే మియావాకి టెక్నిక్ ఉపయోగించి పెరిగిన అడవులు 10 రెట్లు వేగంగా మరియు 30 రెట్లు దట్టంగా పెరుగుతాయన్నారు . ఒక మోనోకల్చర్ తోటలతో పోలిస్తే 30 రెట్లు మెరుగైన కార్బన్ డయాక్సైడ్ శోషణ సామర్థ్యం, 30 రెట్లు మంచి శబ్దం , ధూళిని తగ్గించే సామర్థ్యం మరియు 30 రెట్లు పచ్చటి ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుందన్నారు .

No comments:

Post a Comment