Breaking News

14/11/2019

టీడీపీకి కమలం టెన్షన్

విశాఖపట్టణం, నవంబర్ 14, (way2newstv.in)
బీజేపీ ఎమ్మెల్సీ, గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు నాయ‌కుడు సోము వీర్రాజు తాజాగా పేల్చిన రాజ‌కీయ బాంబు.. రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. అది కూడా టీడీపీ అధినేత‌ చంద్రబాబునాయుడు.. ప్రతిష్టా త్మకంగా తీసుకుని, త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌ద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నా.. లెక్కచేయ‌కుండా.. గురువారం 12 గంట‌ల పాటు ఇసుక దీక్షకు కూర్చుంటున్న నేప‌థ్యంలో సోము పేల్చిన బాంబు టీడీపీలో ప్రకంప‌నలు సృష్టిస్తోంది. చంద్రబాబు ఎంతగా తిరిగినా ఏపీలో టీడీపీ ఖాళీ అవడం మాత్రం ఖాయమని వీర్రాజు భూకంపం లాంటి విష‌యం వెల్లడించారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2024 నాటికి ఏపీలో బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి అవుతుందని సోము ఉద్ఘాటించారు. అంతేకాదు, 23 మంది ఎమ్మెల్యేల కోసం.. చంద్రబాబు ఇంతగా కష్టపడాల్సిన పని లేదని… త్వరలోనే తాము వారందరినీ తీసుకుంటామన్నారు.
టీడీపీకి కమలం టెన్షన్

అందుకు చంద్రబాబు కూడా సహకరిస్తే మంచిందని అన‌డం గ‌మ‌నార్హం. 22 ఎమ్మెల్యేలతో పాటు ఆఖరిలో చంద్రబాబు కూడా బీజేపీలోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో చూడాలని వీర్రాజు చ‌లోక్తులు రువ్వారు. అయితే, ఆయ‌న చేసిన వ్యాఖ్యలు అంత ఆషామాషీగా మాత్రం ఎక్కడా క‌నిపించ‌డం లేదు.టీడీపీ త‌ర‌ఫున జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ గెలిచిన ఎమ్మెల్యేల‌ను ప‌రిశీలిస్తే.. వీరిలో చాలా మంది ఊగిస‌లాడుతున్నారు. ముఖ్యంగా ఐదుగురు ఎమ్మెల్యేల‌ను మేనేజ్ చేస్తున్నట్టు వార్తలు వ‌స్తోన్న నేప‌థ్యంలో మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. పార్టీ మార్పు కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఇటీవ‌ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి రామ్ మాధ‌వ్‌ను వారం రోజుల కింద‌ట క‌లిసి వ‌చ్చారు. ప్రధాని నరేంద్రమోడీని కూడా కలిసి వచ్చారు. అప్పుడే ఆయ‌న పార్టీ మారిపోతార‌నే వార్తలు వ‌చ్చాయి. అయితే, ఎక్కడో బ్రేక్ ప‌డింది. ఇక‌, తాజాగా సోము ఈ వ్యాఖ్యలు చేయ‌డానికి ముందు కూడా గంటాతో భేటీ అయ్యారు. ఈ కార‌ణంగానే సోము వ్యాఖ్యల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.గంటాను క‌లిసిన కొద్ది నిమిషాల‌కే సోము ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ? అని రాజ‌కీయ వ‌ర్గాలు ఆరాలు పేరాలు తీస్తున్నాయి. సోము చెప్పిన‌ట్టు 22 మంది ఎమ్మెల్యేలు కాక‌పోయినా.. చంద్రబాబు వైఖ‌రితో పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్న, ఉన్న దాదాపు 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది పార్టీ నుంచి జంప్ చేసే అవ‌కాశం ఎక్కువ‌గానే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.సైలెంట్‌గా ఉన్న ఈ ఎమ్మెల్యేల్లో చంద్రబాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. మ‌రి వీరిని అప‌ర చాణిక్యుడు చంద్రబాబు ఎలా ర‌క్షించుకుంటారో చూడాలి. ఇప్పటికే చాలా మంది కీలక నాయ‌కులు జంప్ చేశారు. మిగిలిన వారిని కాపాడుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయ‌త్నాలు కూడా తెలిసిందే. వంశీ లాంటి వాళ్లను బుజ్జ గింజేందుకు ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా ఆగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబుకు ఇప్పుడు పార్టీని, ఎమ్మెల్యేల‌ను కాపాడు కోవ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది.

No comments:

Post a Comment