Breaking News

11/11/2019

శ్రీవాణి ట్రస్ట్ కు భారీ స్పందన

తిరుమల, నవంబర్ 11 (way2newstv.in)
తిరుమల శ్రీవేంక‌టేశ్వ‌ర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్ర‌స్టుకు విరాళాలందించే వారికోసం న‌వంబ‌రు 4న ఆన్‌లైన్ అప్లికేష‌న్ టీటీడీ ప్రారంభించింది. ఈ మేరకు టీటీడీ అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్ర‌వారం 200 బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు, మిగ‌తా రోజుల్లో 500 బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన‌ట్టు తెలిపారు. డిసెంబ‌రు 31 వ‌ర‌కు ఆన్‌లైన్ కోటాను విడుద‌ల చేసినట్టు ఈవో తెలిపారు. ఈ వెబ్‌సైట్ ప్రారంభించిన న‌వంబ‌రు 4న ఏడుగురు దాత‌లు రూ.10 వేలు చొప్పున విరాళం అందజేసి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్నార‌ని తెలియజేశారు. 
శ్రీవాణి ట్రస్ట్ కు భారీ స్పందన

అక్టోబ‌రు 21 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1109 మంది దాత‌లు రూ.1.10 కోట్లు విరాళాలు అందజేశారని ధర్మారెడ్డి వివరించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని బ్రేక్ ద‌ర్శ‌నానికి వెళ్ల‌వ‌చ్చ‌ని అన్నారు. ఆన్‌లైన్‌లో ల‌డ్డూలు బుక్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంద‌ని ఆయన తెలిపారు.స‌నాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాలను నిర్మించేందుకు టీటీడీ ఈ ట్ర‌స్టును ప్రారంభించినట్టు అద‌న‌పు ఈవో వెల్లడించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.10 వేలు విరాళ‌మిచ్చే దాత‌ల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ ప్రివిలేజ్‌గా అందజేయనున్నట్టు వివరించారు. అయితే, రూ.500 చెల్లించి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌లు ఒక రూపాయి నుంచి ఎంత‌మొత్త‌మైనా విరాళంగా అందజేయవచ్చని, రూ.10 వేలకు మించితే టీటీడీ క‌ల్పించే ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొన్నారు. రూ.10 వేల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ చొప్పున 99 వేల వ‌ర‌కు 9 టికెట్ల‌ను దాత‌లు పొందే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక ల‌క్ష, ఆపైన విరాళాలు ఇచ్చే దాత‌ల‌కు టీటీడీ ఇదివ‌ర‌కే ప‌లు ట్ర‌స్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న త‌ర‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను వ‌ర్తింప‌జేస్తామ‌ని తెలిపారు.

No comments:

Post a Comment