తిరుచానూరు అక్టోబర్ 19 (way2newstv.in)
తిరుచానూరులోని శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 23 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు శుక్రవారం తెలిపారు. నవంబరు 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 22న లక్ష కుంకుమార్చన, అంకురార్పణ గావిస్తారు.
నవంబరు 23 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
వాహనసేవలు : 23న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేష వాహనం, 24న ఉదయం పెద్దశేష వాహనం, రాత్రి హంస వాహనం, 25న ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనం, 26న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 27న ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి గజవాహనం, 28న ఉదయం సర్వభూపాల వాహనం, మధ్యాహ్నం స్వర్ణరథం, రాత్రి గరుడవాహనం, 29న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 30న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, డిసెంబరు ఒకటిన పంచమి తీర్థం, రాత్రి ధ్వజావరోహణం, 2న సాయంత్రం పుష్పయాగం ఉంటాయి.
No comments:
Post a Comment