తెలంగాణ భాషా పరిరక్షకుడు కాళోజీ
జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
వేములవాడ సెప్టెంబర్ 09 (way2newstv.in)
తెలంగాణయాస, భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు, తన కవితల ద్వారా ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ కలెక్టర్ పిలుపు నిచ్చారు .సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాల్ లో జిల్లా భాషా ,సాంస్కృతిక శాఖఅధ్వర్యంలో కాళోజి నారాయణ రావు 105వ జయంతి ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలకుజిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులనుఅర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ భాషను తన కవితలను మాండలికం ద్వార ప్రజలకు తెలిజేశారన్నారు.
కాళోజి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆయనకు ఎన్ని భాషలపైన మక్కువ ఉన్న తెలంగాణ బాష మక్కువ ఎక్కువచూపారని తెలిపారు. 1972లో పద్మవిభూషన్ అవార్డును అందుకున్నారని కొనియాడారు. కాళోజీ కవితలు సార్వజననీయమైనవని ఆయన కవితల ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు కృషిచేశారన్నారు. తెలంగాణ భాష, యాస, గొప్పదనాన్ని నలుదిక్కులా చాటడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. ప్రజాకవి ఆశయాల కోసం పునరంకితులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ప్రజా గొంతుక కాళోజీఅన్యాయాన్ని ప్రశ్నించి ప్రజా గొంతుకగా కాళోజీ నారాయణరావు నిలిచారని జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాషా అన్నారు. తన కవిత్వం ద్వారాఅన్యాయాన్ని ఎదురించి ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. డీఆర్వో ఎన్ ఖీమ్యా నాయక్ ,డిఆర్డీవో రవీందర్ లు ప్రజాకవి కాళోజి సేవలను గుర్తు చేసారు .ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి టి శ్రీనివాస్ రావు , ,జెడ్పి సీఈవో గౌతమ్ రెడ్డి , జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిoడ్ల దశరథం ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment