ఎమ్మిగనూరు సెప్టెంబర్ 09 (way2newstv.in)
ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న రావూస్ కళాశాల కు యూనివర్సిటీ అధికారులు తోత్తులుగా మారారని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సురేంద్ర బాబు పేర్కొన్నారు. ఈ సందర్బంగా రావూస్కళాశాలకు తొత్తులు గా మారిన యూనివర్సిటీ అధికారి దిష్టిబొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ రావుస్ కళాశాలలో కనీస వసతులు కరువయ్యాయని, షాపింగ్ కాంప్లెక్స్ లో తరగతులునిర్వహించడం సిగ్గుచేటని అన్నారు.
రాయలసీమ యూనివర్సిటీ అధికారుల దిష్టిబొమ్మ దహనం
ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతి కూడా లేకుండా తరగతులు నిర్వహించడం చాలా దారుణమని,విద్యార్థుల నుంచి రికార్డుల పేరుతో అధికంగా ఫీజులను వసూలుచేయడం దారుణమని అన్నారు.ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2గం.ల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తూ, కనీసం విద్యార్థుల అవసరాలకు కూడా బయటికిపంపకుండా చూస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన విద్యార్థి సంఘాల నాయకులను లోపలికి వెళ్లనివ్వకుండా ఒక సబ్ జైల్మాదిరిగా రావూస్ కళాశాల నడుపుతున్నారు అని అన్నారు. ఇకనైనా యూనివర్సిటీ ఈ కళాశాల పై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజిత్, ఉపాధ్యక్షుడుఉదయ్, మండల అధ్యక్షుడు సిసింద్రీ, విజయ్, శివ, నాగరాజు,నవీన్,భాషా, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment