Breaking News

28/09/2019

ఏపీలో మూడో పక్షానికి చోటు లేదా

విశాఖపట్టణం, సెప్టెంబర్ 28 (way2newstv.in)
రాజకీయాలు సాఫీగా సాగితే కిక్కు ఉండదు. అవి ఎప్పటికపుడు మలుపులు తిరిగితేనే హుషార్ ఉంటుంది. రాజకీయ జీవులకు కూడా అపుడే నేమ్ ఫేమ్ వస్తుంది. అలా గమ్మున ఒకే చోట ఉండిపోతే రాజకీయ ప్రపంచం ఆగిపోతుంది కదా. ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో ఇపుడు కొత్త సమీకరణలకు తెర లేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులను చూసిన తరువాత బాగా పాపులర్ అయిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రెండేళ్ల క్రితం తన అధికార పదవికి రాజీనామా చేసి డైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చేసారు. జేడీ లక్ష్మీనారాయణ మొదట్లో సొంతంగా పార్టీ పెడదామనుకున్నారు. తన పేరు కలసివచ్చేలా జనధ్వని అని కూడా పెడతారని ప్రచారం జోరుగా సాగింది. 
ఏపీలో మూడో పక్షానికి చోటు లేదా

అయితే ఎన్నికలు రావడంతో ఆయన జనసేనలో చేరిపోయారు.జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీకి దిగిన జేడీ చివరికి పరాజయం పాలు అయ్యారు. ఆయన ఆ తరువాత కాలంలో పవన్ తో సన్నిహితంగా ఉంటున్నట్లుగా ఎక్కడా కనిపించలేదు. పవన్ సైతం తన పార్టీలో కీలకమైన పదవుల్లో జేడీకి అవకాశం కల్పించలేదు. ఇక జేడీ రాజకీయం ఎలా ఉంటుంది. ఏ వైపుగా సాగుతుంది అన్నది చర్చగా ఉంది దానికి రకరకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. ఆయన బీజేపీలో చేరుతారని కూడా అన్నారు. దాన్ని జేడీ లక్ష్మీనారాయణ గట్టిగానే తోసిపుచ్చారు. తాను జనసేనలో ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని గ్రీట్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఇపుడు హఠాత్తుగా కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి తలుపు తట్టారు. తాజాగా ఈ భేటీ గంట పాటు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి ఇద్దరు నేతలూ ఏకాంతంగా చర్చలు జరిపారని కూడా అంటున్నారు.ఏపీలో రాజకీయం రెడ్లు, కమ్మల మధ్య కేంద్రీకృతమైన నేపధ్యంలో మూడవ పక్షంగా కాపు సామాజిక వర్గం నుంచి అధికారం కోసం అడుగులు వేయాలని చాలా కాలంగా అంతా అనుకుంటున్న మాట. అయితే అది వివిధ రూపాల్లోకి వచ్చినా కూడా ఎక్కడా సఫలం కాలేదు. 2009లో మెగాస్టార్ చిరంజీవి నాయకత్వాన ప్రజారాజ్యం వచ్చినపుడు కాపుల పార్టీ అన్నారు. 2019లో పవన్ జనసేన కాపుల పార్టీగా చెప్పకపోయినా అది కూడా అలాంటిదే అన్నారు కానీ దారుణంగా ఫెయిల్ అయింది. ఇపుడు ఈ ఇద్దరు నేతలు కలసి ఏ రకమైన రాజకీయాన్ని వండి వార్చబోతున్నారన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది. జేడీ లక్ష్మీనారాయణకి మేధావిగా పేరు ఉంది. కులం లేదంటారు, మరి కులం గడప నుంచి బయటకు రాని ముద్రగడతో కలసి జేడీ లక్ష్మీనారాయణ ఏ రకమైన రాజకీయ ప్రయోగం చేస్తారోనని అంతా గమనిస్తున్నారు. మరి జేడీ లక్ష్మీనారాయణ, ముద్రగడ కలసి బీజేపీలోకి వెళ్తారా అన్న మరో చర్చ కూడా ఉందిపుడు. చూడాలి ఏం జరుగుతుందో.

No comments:

Post a Comment