Breaking News

28/09/2019

మరింత తగ్గిన వెండి, బంగారం ధరలు

ముంబై సెప్టెంబర్ 28 (way2newstv.in)
బంగారం, వెండి ధరలు తగ్గాయి. బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్ ఇందుకు కారణం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు  0.14 శాతం క్షీణతతో రూ.37,740కు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ఫ్యూచర్స్ ధర కేజీ 0.24 శాతం క్షీణతతో రూ.46,267కు తగ్గింది.పసిడి ధర ఈ నెలలో డౌన్ ట్రెండ్‌లోనే కదలాడుతూ వచ్చింది. వెండి ధరల పరిస్థితి కూడా ఇంతే. అయితే ఈ నెల ఆరంభంలో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి  చేరిన విషయం తెలిసిందే. 
మరింత తగ్గిన వెండి, బంగారం ధరలు

పసిడి ధర గరిష్ట స్థాయి నుంచి చూస్తే రూ.2,150 పతనమైంది. వెండి ధర రూ.51,489 గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా రూ.5,220 పడిపోయింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర కూడా పడిపోతూనే వస్తోంది. బంగారం ధర ఔన్స్‌కు ఇటీవలనే ఆరేళ్ల గరిష్ట స్థాయి 1,550 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. అయితే అటుపై బంగారం మళ్లీ ఆ స్థాయిని అందుకోలేకపోయింది. ఇప్పుడు బంగారం ధర ఔన్స్‌కు 1.04 శాతం క్షీణతతో 1,499.55 డాలర్ల వద్ద ఉంది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 2.48 శాతం తగ్గుదలతో 17.47 డాలర్లకు దిగొచ్చింది.బంగారం పడిపోకుండా ఉండేందుకు కొన్ని అంశాలు దోహదపడుతున్నాయి. ప్రపంచ వృద్ధి ఆందోళనలు, గ్లోబల్ కేంద్ర బ్యాంకుల మానిటరీ పాలసీ సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వాటిని ఇందుకు ఉదాహరణ పేర్కొనవచ్చు. ఈటీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడం, వాషింగ్టన్‌లో రాజకీయ సంక్షోభం వంటి అంశాలు కూడా పసిడికి మద్దతునిస్తున్నాయి.

No comments:

Post a Comment