Breaking News

28/09/2019

హైద్రాబాద్ లో వాన కష్టాలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 28 (way2newstv.in)
హైదరాబాద్‌ను హడలెత్తించిన వర్షాలు ప్రస్తుతానికి శాంతించినా.. అవి మిగిల్చిన నష్టం ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. నగరంలో రోడ్లన్నీ భారీ గుంతలతో ప్రమాదకరంగా మారగా, వాన నీటిలో చిక్కుకున్న వీధుల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. దీంతో ప్రజలు ట్విట్టర్ వేదికగా పలు వీడియోలను పోస్టు చేస్తున్నారు. మరోవైపు వర్షం తర్వాత నగరంలో నెలకొన్న పరిస్థితులపై పలువురు జోకులు కూడా పేలుస్తున్నారు.
హైద్రాబాద్ లో వాన కష్టాలు

వర్షాల వల్ల కొన్ని వీధుల్లో నీరు వాగుల తరహాలో ప్రవహించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ఓ ప్రాంతంలో చెత్త రిక్షా ఒకటి దానికదే వేగంగా కదిలి వెళ్లడం నవ్వు తెప్పిస్తోంది. మరో వీడియోలో వాహనదారులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న స్కూటర్లను, బైకులను కాపాడుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. ఆ బీభత్సాన్ని కళ్లకు కట్టే చిత్రాలు, వీడియోలను ఈ ట్వీట్లలో చూడండి.

No comments:

Post a Comment